Apple Updates: ఎస్ఈ ఫోన్ ధర పెంచేసిన యాపిల్.. వచ్చేవారంలో కొత్త ఐపాడ్ విడుదల!
యాపిల్ కంపెనీ ఐఫోన్ ఎస్ఈ మోడల్ ధరన పెంచింది. దీంతో ధర పరంగా ఎస్ఈ మోడల్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లను దాటేసింది. త్వరలోనే యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. వాటి వివరాలివే.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ సిరీస్‌లో బడ్జెట్ మోడల్‌గా చెప్పుకునే ఎస్ఈ 2022 ఫోన్ మరింత ప్రియం కానుంది. మరోవైపు, యాపిల్ కంపెనీ రెండు కొత్త ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇంతకీ, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ధరను ఎందుకు పెంచింది? కొత్తగా రాబోమే రెండు డివైజ్‌ల వివరాలేంటో చూద్దాం.
ఐఫోన్ ఎస్ఈ 2022 (iPhone SE 2022)
యాపిల్ కంపెనీ ఐఫోన్ ఎస్ఈ 2022/ఎస్ఈ 3 (iPhone SE) మోడల్ ధరను భారత మార్కెట్లో ₹ 6వేలు పెంచింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ధర ₹ 43,900గా ఉంది. తాజా పెంపుతో ₹ 49,900కు చేరుకుంది. ఒక్కసారిగా ₹ 6వేల ధర ఎందుకు పెంచారనే దానిపై యాపిల్ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ధర పరంగా ఎస్ఈ 3, ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలను దాటేసింది. ఐఫోన్ సిరీస్‌లో 5జీ సాంకేతికతను సపోర్ట్ చేసే ఏకైక బడ్జెట్ మోడల్ ఎస్ఈ 3. తాజాగా, భారత్‌లోని ప్రధాన నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్ఈ 3 ధర పెంపు టెక్ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఈ ఫోన్లో ఏ15 బయోనిక్ ప్రాసెసర్ ఉపయోగించారు. 4.7 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. వెనుక 12 ఎంపీ, ముందు 7 ఎంపీ కెమెరాలున్నాయి.
యాపిల్ డాక్ (Apple Dock)
అమెజాన్ ఈకో షో తరహాలో యాపిల్ కొత్త డాక్‌ను తీసుకురానుంది. యాపిల్ కొత్తగా తీసుకొస్తున్న ఈ డాక్‌ను యూజర్ తన అవసరానికి తగినట్లుగా స్మార్ట్ డిస్ప్లే, స్పీకర్‌గా మార్చుకోవచ్చు. దీంతో యూజర్లు ఫేస్‌టైమ్ ద్వారా కాల్స్ మాట్లాడటంతోపాటు, స్మార్ట్‌హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేయొచ్చని సమాచారం. దీంతోపాటు మల్టీటచ్ ఫంక్షనాలిటీతో హోమ్‌పాడ్ మినీ (HomePod Mini)ని తీసుకొస్తుందట.
యాపిల్ ఐపాడ్ (Apple iPad)
యాపిల్ కంపెనీ ఐపాడ్ సిరీస్‌లో పదో జనరేషన్ మోడల్‌ను రెండు కొత్త వేరియంట్లలో అక్టోబరు 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఐపాడ్, ఐపాడ్ ప్రో పేరుతో వీటిని పరిచయం చేస్తోంది. ఐపాడ్లో 11 అంగుళాల డిస్ప్లే, ఐపాడ్ ప్రోలో 12.9 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. ఐపాడ్ ఓఎస్ 16.1తో ఇవి పనిచేస్తాయి. యాపిల్ ఎమ్2 ప్రాసెసర్‌ను వీటిలో ఉపయోగించారు. యూఎస్బీ-సీ, 5జీ కనెక్టివిటీ ఫీచర్లు ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ