Data Privacy: ఐఓఎస్‌ కొత్తఅప్‌డేట్‌.. ప్రైవసీ కోసం కొత్త ఫీచర్‌...ఏంటంటే?

వ్యక్తిగత సమాచార గోప్యతకు భద్రత కల్పించే విధంగా యాపిల్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ కోసం యూజర్స్ తమ ఐఫోన్లలో ఐఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. 

Updated : 20 Dec 2021 19:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యక్తిగత సమాచార గోప్యత.. ప్రస్తుతం ఆన్‌లైన్ వినియోగించే ప్రతి ఒక్కరి ప్రాధాన్యతాంశం. ఈ-మెయిల్స్‌, చాటింగ్, షాపింగ్‌, బ్యాకింగ్‌, టికెట్‌ బుకింగ్, ఫుడ్‌ ఆర్డర్‌ వంటి సేవలకు సంబంధించి రోజులో మనం ఎన్నో రకాల యాప్‌లు, వెబ్‌సైట్లు ఉపయోగిస్తుంటాం. అయితే ఈ సేవలు పొందే సమయంలో కొన్ని యాప్‌లు యూజర్‌ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయనే ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్ డేటాను ట్రాక్ చేసే యాప్‌ల వివరాలు తెలుసుకుని వాటికి అనుమతులు నిరాకరించేందుకు అనువైన ఫీచర్‌ను యాపిల్ తమ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఇటీవల విడుదల చేసిన ఐఓఎస్‌ 15 ఓఎస్‌ను అప్‌డేట్ చేసి ఐఓఎస్ 15.2 వెర్షన్‌ను విడుదల చేసింది. యూజర్స్ ఈ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకుని తమ ఫోన్ సెట్టింగ్స్‌లో చిన్నపాటి మార్పులు చేసి ట్రాకింగ్ యాప్స్‌కు చెక్ పెట్టేయొచ్చు. మరి అదెలానో చూద్దాం. 

* ముందుగా యూజర్స్ తమ యాపిల్‌ ఫోన్లలో (ఐఫోన్ 6ఎస్‌ ఆపై మోడల్స్‌) ఐఓఎస్‌15.2 వెర్షన్ అప్‌డేట్ చేయాలి. 

* తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో కిందకు స్క్రోల్‌ చేస్తే ’యాప్‌ ప్రైవసీ రిపోర్ట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ మొబైల్‌లోని ఏయే యాప్స్‌ డేటాను యాక్సెస్ చేశాయనేది తెలుస్తుంది. 

* అలా మీ డేటా సేకరిస్తున్న యాప్‌లకు మీరు కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్‌కు సంబంధించి ఏవైనా అనుమతులు ఇచ్చి ఉంటే వెంటనే వాటిని డిసేబుల్ చేయొచ్చు. అలా యాప్‌లు మీ డేటాను సేకరించకుండా అడ్డుకోవచ్చు. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు