Apple Lockdown Mode: స్పైవేర్‌కు చెక్ పెట్టేందుకు యాపిల్ లాక్డౌన్ మోడ్
గత కొంత కాలంగా కొంత మంది వ్యక్తులు, సంస్థలు యాపిల్ యూజర్లు లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యాపిల్ సంస్థ యూజర్ల కోసం పటిష్టమైన భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది...
ఇంటర్నెట్‌డెస్క్: యాపిల్ కంపెనీ వ్యక్తిగత గోప్యతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. కానీ, కొంత మంది వ్యక్తులు, సంస్థలు యాపిల్ యూజర్లు లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యాపిల్ సంస్థ యూజర్ల కోసం పటిష్ఠమైన భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సెప్టెంబరులో విడుదలకానున్న ఐఓఎస్ 16, ఐపాడ్ఓఎస్ 16, మాక్ఓఎస్ వెంచురాలో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. లాక్డౌన్ మోడ్ (Lockdown Mode) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ సైబర్‌దాడుల నుంచి ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ కంప్యూటర్లలోని యూజర్ల డేటాకు రక్షణ కవచంలా పనిచేస్తుందని యాపిల్ కంపెనీ తెలిపింది.
యూజర్లు తమ డివైజ్‌లలో లాక్డౌన్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మెసేజ్‌లు, వెబ్ బ్రౌజింగ్, యాపిల్ సేవలు వంటి వాటితోపాటు, ఇతరత్రా సర్వీసుల ద్వారా జరిగే సైబర్ దాడుల నుంచి పూర్తి రక్షణ ఉంటుందని యాపిల్ ధీమా వ్యక్తం చేసింది. కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అభివృద్ధి చేసిన స్పైవేర్ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో ఐఫోన్లు, యాపిల్ డివైజ్‌లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూజర్ల గోప్యతకు భంగం కలిగించే నిఘా సాఫ్ట్వేర్లకు చెక్ పెట్టేందుకు యాపిల్ లాక్డౌన్ మోడ్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన కొద్ది మంది యూజర్లతో పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇందులోని లోపాలను కనుగొన్న బగ్ బౌంటీస్కు అత్యధికంగా రెండు మిలియన్ డాలర్లు పారితోషికం అందిస్తామని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరులో విడుదలయ్యే ఐఓఎస్ 16 ఓఎస్‌తో యూజర్లు తమ డివైజ్‌లలో ఈ ఫీచర్‌ను పొందొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.