iPad Pro 2022: 5జీ సపోర్ట్‌తో యాపిల్ కొత్త ఐపాడ్‌లు.. ఎమ్‌2 చిప్‌తో ప్రో మోడల్‌.. ఇంకా!

యాపిల్ కంపెనీ 5జీ సపోర్ట్, లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో రెండు కొత్త ఐపాడ్‌లను విడుదల చేసింది. అంతేకాకుండా యాపిల్ కొత్తగా అభివృద్ధి చేసిన చిప్‌సెట్‌ను ఒక మోడల్‌లో ఉపయోగించారు. మరి, వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Published : 21 Oct 2022 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ కంపెనీ రెండు కొత్త ఐపాడ్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అవి ఐపాడ్ ప్రో (iPad Pro), పదో జనరేషన్‌ ఐపాడ్ (iPad). ఐపాడ్‌ ప్రోలో యాపిల్ కొత్తగా అభివృద్ధి చేసిన ఎమ్‌2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మరో ఐపాడ్‌లో మ్యాజిక్‌ కీబోర్డు సపోర్ట్‌, రెటీనా డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఇస్తున్నారు. వీటి ధర, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.


ఐపాడ్ ప్రో 

ఈ ఐపాడ్‌ను రెండు స్క్రీన్‌ సైజుల్లో తీసుకొచ్చారు. 11, 12.9 అంగుళాల లిక్విడ్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఐపాడ్‌ఓఎస్ 16తో పనిచేస్తుంది. స్టేజ్‌ మేనేజర్‌, ఫుల్ ఎక్స్‌టర్నల్‌ డిస్‌ప్లే, డెస్క్‌టాప్‌-క్లాస్‌ యాప్స్‌, రిఫరెన్స్‌ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎమ్‌2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుక వైపు 12ఎంపీ, 10 ఎంపీ కెమెరాలు.  ముందు భాగంలో 12 ఎంపీ కెమెరా అమర్చారు. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 20 వాట్ యూఎస్‌బీ టైప్‌-సీ థండర్‌బోల్ట్ ఛార్జర్‌ ఇస్తున్నారు. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 11 అంగుళాల డిస్‌ప్లే ప్రారంభ ధర రూ.81,900. 12.9 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌ ప్రారంభ ధర రూ.1,12,900. అక్టోబరు 26 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. యాపిల్ వెబ్‌సైట్‌ నుంచి ముందుస్తు బుకింగ్స్‌ చేసుకోవచ్చు. 


ఐపాడ్‌ 

ఇందులో ఏ14 బయోనిక్ చిప్‌ ఉపయోగించారు. 10.9 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు, ముందుభాగంలో 12 ఎంపీ కెమెరాలను అమర్చారు. ఐపాడ్ఓఎస్‌ 16తో పనిచేస్తుంది. గత ఐపాడ్‌తో పోలిస్తే ఇందులో స్క్రీన్‌ సైజ్‌ పెరగడంతోపాటు, హోమ్‌ బటన్‌ స్థానంలో టచ్‌ఐడీ ఇస్తున్నారు. మ్యాజిక్‌ కీబోర్డ్‌ సపోర్ట్‌, వైఫై-6, లాంగ్‌ బ్యాటరీ, 5జీ సపోర్ట్‌, లౌడ్‌ స్టీరియో స్పీకర్స్‌, యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్ పోర్ట్‌ ఇందులోని ప్రత్యేకతలు. 64 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.  ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.44,900. అక్టోబరు 26 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. యాపిల్ వెబ్‌సైట్‌ నుంచి ముందస్తు బుకింగ్స్‌ చేసుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని