iPhone 12: మ్యాగ్‌సేఫ్‌తో ఛార్జింగ్ కష్టాలకు చెక్‌

ఐపోన్‌ 12 యూజర్స్ కోసం యాపిల్ మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ పేరుతో కొత్త యాక్ససరీని తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్ 12 యూజర్స్ తమ ఫోన్‌ బ్యాటరీని ఎప్పుడైనా, ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ అయస్కాంతం సాయంతో ఐఫోన్ 12 ఫోన్లకు వెనకవైపు అతికించవచ్చు. తర్వాత ఇందులోని వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ ఫోన్‌ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది...

Updated : 12 Aug 2022 12:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపోన్‌ 12 యూజర్స్ కోసం యాపిల్ మ్యాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్‌ పేరుతో కొత్త యాక్ససరీని తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్ 12 యూజర్స్ తమ ఫోన్‌ బ్యాటరీని ఎప్పుడైనా, ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ అయస్కాంతం సాయంతో ఐఫోన్ 12 ఫోన్లకు వెనకవైపు అతికించవచ్చు. తర్వాత ఇందులోని వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ ఫోన్‌ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఫోన్‌ వెనక బ్యాటరీ ప్యాక్‌ అతికించిన వెంటనే స్క్రీన్‌ మీద ఎంత శాతం బ్యాటరీ ఉందనేది చూపిస్తుంది. తర్వాత ఛార్జ్ అవుతున్నట్లు లైట్ వెలుగుతుంది. ఫోన్ పూర్తిగా ఛార్జ్‌ అయ్యాక బ్యాటరీ ప్యాక్‌ గ్రీన్‌ లైట్‌ను చూపిస్తుంది. ఇది ఫోన్‌కు 5వాట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను 20వాట్ లేదా అంతకు మించిన యూఎస్‌బీ-సీ అడాప్టర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. మ్యాగ్‌సేఫ్‌లో 1,469ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఐఫోన్ 12 సిరీస్‌లోని అన్ని మోడళ్లను మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ చేస్తుంది. దీని ధర 99 డాలర్లు (సుమారు రూ. 10,900 ). అయితే బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్‌ చేసే కేబుల్‌, అడాప్టర్‌కు అదనంగా ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందే.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని