Apple: ఉచితంగా ఎయిర్‌పాడ్స్... వారికి మాత్రమే..!
ఎడ్యుకేషనల్ ఆఫర్ కింద యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. మ్యాక్ లేదా ఐపాడ్ కొనుగోలు చేసే విద్యార్థులకు యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ..
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. మ్యాక్ లేదా ఐపాడ్ కొనుగోలు చేసే విద్యార్థులకు ఎడ్యుకేషనల్ ఆఫర్ కింద యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. యాపిల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా భారతీయ యూజర్స్ ఈ ఆఫర్ కింద కొనుగోళ్లు చేయవచ్చని వెల్లడించింది. కొత్తగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు, బోధనా సిబ్బంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలపింది. అర్హులైన వారు తమ గుర్తింపు కార్డును యాపిల్ యూనిడేస్ ఫ్లాట్‌ఫాం లేదా యాపిల్ స్పెషలిస్ట్ ద్వారా చెక్ చేయించుకోవాలి.
మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్, మ్యాక్ ప్రో, మ్యాక్ మినీ, ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనితోపాటు ఎయిర్‌పాడ్ వైర్లెస్ ఛార్జింగ్ కేస్‌ను ₹4,000కు, ఎయిర్‌పాడ్స్ ప్రో వైర్లెస్ ఛార్జింగ్ కేస్‌ను ₹10,000కు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు కిడ్డోపియా, సింప్లీ పియానో, డిస్నీ బైజూస్, హెడ్‌వే, లింగోకిడ్స్ వంటి ఎడ్యుకేషనల్ యాప్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇవేకాకుండా యాపిల్‌కేర్ ఎక్స్డెండ్ వారంటీపై 20 శాతం, యాపిల్ పెన్సిల్, మ్యాజిక్ కీ బోర్డ్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఆర్కేడ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ
-
Movies News
Naga Vamsi: SSMB 28 రిజల్ట్‌పై నెటిజన్ జోస్యం.. నిర్మాత అసహనం
-
Sports News
IND vs NZ: భారత బౌలర్ల దెబ్బకు 66 పరుగులకే చేతులెత్తేసిన కివీస్
-
Politics News
Budget 2023: కేంద్ర బడ్జెట్‌పై ఎవరేం అన్నారంటే..?
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే