iPhone 14 Series: మొబైల్‌ నెట్‌వర్క్‌ అవసరం లేకుండా ఫోన్ కాలింగ్!

ఐఫోన్ 14లో యాపిల్ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఫోన్‌ కాలింగ్‌, మెసేజింగ్ చేసుకోవచ్చు. 

Published : 29 Aug 2022 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఐఫోన్‌ 14 మోడల్‌ను సెప్టెంబరు 7న జరిగే యాపిల్‌ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ ఫీచర్లు, ధర గురించిన సమాచారం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను ఐఫోన్ 14లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇందులో యాపిల్‌ ఎల్‌ఈఓ (లో ఎర్త్‌ ఆర్బిట్‌) శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ను ఆఫర్‌ చేస్తోందట. దీని ద్వారా యూజర్లు మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో కూడా శాటిలైట్‌ కనెక్టివిటీతో కాల్స్‌, మెసేజ్‌లు చేయొచ్చు. ఇందుకోసం యాపిల్‌ గ్లోబల్‌స్టార్‌ అనే సంస్థతో కలిసి సొంత శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను ప్రారంభించనుందట. దీనిపై యాపిల్‌ ఈవెంట్‌లో కంపెనీ ప్రకటన చేస్తుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో యాపిల్ చేరనుంది.  

ఐఫోన్ 14, ఐఫోన్‌ 14 మ్యాక్స్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ అనే నాలుగు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఇందులో ఏ15 బయోనిక్‌ చిప్‌ ఉపయోగించారు. దీనితో పాటు మూడు కొత్త ఐపాడ్ మోడల్స్‌, మ్యాక్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్ ప్రో, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8 విడుదలకానున్నాయి. యాపిల్ వాచ్‌ ప్రోలో టైటానియమ్ ఫ్రేమ్‌తో 1.99 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎస్‌8 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఈ వాచ్‌లో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, లో పవర్‌ మోడ్‌ వంటి ఫీచర్లున్నాయట. పూర్తి వివరాల కోసం సెప్టెంబరు 7 వరకు వేచి చూడాల్సిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని