Published : 03 Jan 2022 04:33 IST

iPhone: ఐఫోన్‌లో కొత్త ఫీచర్‌.. ఫోన్‌ డిస్‌ప్లేతోఛార్జింగ్

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్ కంపెనీ భవిష్యత్‌లో విడుదల చేసే ఐఫోన్‌, ఐపాడ్‌లలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. దీంతో యూజర్స్ తమ యాపిల్‌ ఉత్పత్తులను సులువుగా ఛార్జింగ్ చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యూజర్స్ తమ యాపిల్ ఉత్పత్తులను ఐఫోన్‌/ఐపాడ్ డిస్‌ప్లేపై ఉంచి ఛార్జ్‌ చేసుకోవచ్చట. అంటే ఇక మీదట ఐఫోన్‌/ఐపాడ్ డిస్‌ప్లేనే ఛార్జర్‌లా పనిచేస్తుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు యాపిల్ కంపెనీ ‘థ్రూ-డిస్‌ప్లే వైర్‌లెస్‌ ఛార్జింగ్ (Through-Display Wireless Chareging)’ అనే టెక్నాలజీపై పేటెంట్ పొందినట్లు సమాచారం. యూజర్స్‌ ఈ టెక్నాలజీ సాయంతో ఐఫోన్/ఐపాడ్ ద్వారా ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌లతోపాటు ఇతర యాక్సెసరీలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే యాపిల్ డిస్‌ప్లే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే సాంకేతికతను కూడా ఆయా డివైజ్‌లలో పరిచయం చేయాల్సి ఉంటుందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఛార్జ్‌ చేసేందుకు మెగాసేఫ్‌ ఛార్జర్, బ్యాటరీ ప్యాక్‌లను పరిచయం చేసింది. యాపిల్ కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ 14లో ఈ-సిమ్‌ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ నేపథ్యంలో వైర్‌లెస్‌ డిస్‌ప్లే ఛార్జింగ్ టెక్నాలజీ వార్తలు రావడంతో ఐఫోన్ 14లోనే ఈ టెక్నాలజీని పరిచయం చేస్తారని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత లేదు. గతేడాది నుంచి యాపిల్ ఐఫోన్లతోపాటు ఇచ్చే ఛార్జింగ్ అడాప్టర్‌ను నిలిపివేసింది. ఈ క్రమంలో యాపిల్ తీసుకొస్తున్న సాంకేతికత యూజర్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Read latest Tech & Gadgets News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని