Apple Watch: మరో సంచలనానికి రెడీ అవుతోన్న యాపిల్‌.. సిగ్నల్‌ లేకుండానే కాల్స్‌, మెసేజెస్‌!

టెక్‌ దిగ్గజం యాపిల్‌ మరో సంచలనానికి రెడీ అవుతోంది. భవిష్యత్‌లో తమ కంపెనీ విడుదల చేయబోయే యాపిల్‌ వాచ్‌లలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఫీచర్‌

Updated : 13 Aug 2022 12:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెక్‌ దిగ్గజం యాపిల్‌ మరో సంచలనానికి రెడీ అవుతోంది. భవిష్యత్‌లో తమ కంపెనీ విడుదల చేయబోయే యాపిల్‌ వాచ్‌లలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఫీచర్‌ తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ఫీచర్‌ సాయంతో ఫోన్‌ సిగ్నల్‌ లేనప్పుడు అత్యవసర కాల్స్‌, టెక్ట్స్ మెసేజ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతోపాటు మనం ప్రమాదంలో ఉన్నామని సహాయం కోరుతూ ఇతరులకు తెలియజేసే అలర్ట్ ఫీచర్‌ ‘ఎస్‌ఓఎస్‌’ను కూడా ఇస్తోంది.

శాటిలైట్‌ కనెక్టివిటీ ఫీచర్‌ను ముందుగా ఐఫోన్‌ 13 సిరీస్‌లోనే తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు షార్ట్‌ మెసేజెస్‌ పంపేలా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలనుకుంది. ఐఫోన్‌ 13లో వీలు పడకపోవడంతో తాజాగా ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఈ ఫీచర్‌  తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అనంతరం ఈ సాంకేతికతతో యాపిల్ వాచ్‌లనూ విడుదల చేయాలని యోచిస్తోంది.

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఫీచర్‌ రెండు విధాలుగా పనిచేస్తుంది.  ఒకటి ‘ఎమర్జెన్సీ మెసేజెస్‌ వయా కాంటాక్ట్స్‌’. యూజర్లకు ఫోన్‌ సిగ్నల్‌ అందుబాటులో లేకపోయినా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ద్వారా కొన్ని అత్యవసర నెంబర్లకు షార్ట్‌ టెక్ట్స్‌ మెసేజ్‌ పంపించేలా ఇది పనిచేస్తుంది. యూజర్లు ఆపదలో చిక్కుకున్నపుడు (పడవ మునిగిపోవడం, విమానం కూలిపోవడం, కారు ప్రమాదం లాంటివి) వాచ్‌ సెన్సార్స్‌ యాక్టివేట్‌ అయ్యి రిస్క్యూ సర్వీసెస్‌ ఏమైనా అవసరమా అని అడిగేలా రెండోది పనిచేస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ అన్ని దేశాల్లో అందుబాటులో ఉండదని ఓ ఆంగ్ల వైబ్‌సైట్‌ రాసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని