Apple iPhone: ఐఫోన్‌ చోరీలకు చెక్‌ పెట్టేందుకు యాపిల్ కొత్త పాలసీ!

మొబైల్‌ దిగ్గజం ఐఫోన్‌ చోరీలకు చెక్‌ పెట్టేందుకు కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై దొరికిన, దొంగలించిన ఫోన్లకు రిపేర్‌ చేయబోమని స్పష్టం చేసింది.

Published : 02 Apr 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ దిగ్గజం ఐఫోన్‌ చోరీలకు చెక్‌ పెట్టేందుకు కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై దొరికిన, దొంగిలించిన ఫోన్లకు రిపేర్‌ చేయబోమని స్పష్టం చేసింది. అయితే, మొబైల్‌ పోయిందని/దొంగిలించారని గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ అసోసియేషన్‌ (జీఎస్‌ఎంఏ) డివైజ్‌ రిజిస్ట్రీలో రిజిస్టర్‌ అయ్యి ఉన్న ఫోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది.


జీఎస్‌ఏంఏ డివైజ్‌ రిజిస్ట్రీ ఏంటీ?

గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ అసోసియేషన్‌ (జీఎస్‌ఎంఏ) వెబ్‌సైట్‌ ప్రకారం.. ఒకవేళ మొబైల్‌ పోయినట్లు, దొంగతనానికి గురైనట్లు ఆ డివైజ్‌ యజమాని గ్లోబల్‌ రిజిస్ట్రీలో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, రిజిస్ట్రేషన్‌కు కొంత డబ్బు చెల్లించాలి. ఒకసారి డివైజ్‌ గురించి రిజిస్ట్రీలో నమోదు అయ్యాక దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయా సర్వీసు సెంటర్‌లకు జీఎస్‌ఎంఏ సమాచారం అందిస్తుంది. 


మరి ఇంతకు ముందు రిపేర్‌ చేయలేదా?

ఇంతకు ముందు యాపిల్‌ ఫోన్లలో ‘ఫైండ్‌ మై ఐఫోన్‌’ యాక్టివేషన్‌లో ఉంటేనే మొబైళ్లను కంపెనీ రిపేర్‌ చేసేది. ‘‘ఒకవేళ ఫైండ్ మై ఐఫోన్‌ టర్న్‌ ఆఫ్ చేసి ఉన్నట్లయితే, మీ డివైజ్‌కు సర్వీస్‌ అందించలేకపోవచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా మీ ఫోన్‌ను సర్వీసింగ్‌కు తీసుకొస్తే దాన్ని నియంత్రించడానికి ఈ విధానం అమలులో ఉంది’’ అని యాపిల్ తన సపోర్ట్‌ పేజీలో స్పష్టం చేసింది.


ఈ కొత్త పాలసీ ఏవిధంగా ఉపయోగపడుతుంది?

ఈ పాలసీ ద్వారా ఐఫోన్ చోరీలను తగ్గించాలనేది యాపిల్ ముఖ్య ఉద్దేశం. అయితే యూజర్లు తమ ఐఫోన్లలో ‘ఫైండ్ మై ఫోన్‌’ అనే ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకొని ఉండాలి. అలానే ఫోన్‌ లాక్‌ అయిండాలి. ఒకవేళ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయకున్నా, ఫోన్‌ లాక్‌ చేసి లేకపోయినా ఐఫోన్‌ చోరీని అడ్డుకోవడం సాధ్యపడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని