Published : 17 May 2022 13:19 IST

Apple WWDC 2022: యాపిల్‌ కొత్త ఆవిష్కరణలు.. ఈసారి అంతకుమించి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజం యాపిల్‌ కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా నిర్వహించే వరల్ట్‌ వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌(WWDC 2022)లో తమ ప్రొడక్ట్స్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఏడాది వర్చువల్‌ వేదికగా జూన్ 6 నుంచి 10 వరకు ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరి ఈవెంట్‌లో యాపిల్ ఆవిష్కరించే కొత్త ప్రొడక్ట్స్‌ ఏంటో తెలుసుకుందాం..


ఐఓఎస్‌ 16 (iOS 16)
యాపిల్ ఈ ఏడాది జరగబోయే ఈవెంట్‌లో అప్‌డేటెడ్‌ ఐఓఎస్‌16ను విడుదల చేస్తున్నట్లు తెలిసింది. కొత్త ఐఓఎస్‌లో ఇంటర్‌ఫేస్‌ ట్వీక్స్‌,  నోటిఫికేషన్స్‌, హెల్త్‌ యాప్‌, సర్వీసెస్‌ వంటి వాటిలో అప్‌డేట్స్‌ తీసుకొస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంటర్‌ఫేస్‌ ట్వీక్స్‌లో స్టేటస్‌ బార్‌, కార్‌ క్రాష్‌ డిటేక్షన్‌, ఎమర్జెన్సీ శాటిలైట్ ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. అలాగే అప్‌డేటెడ్‌ వెర్షన్‌ హెల్త్‌ యాప్‌ను తీసుకురావడానికి యాపిల్‌ యోచిస్తోంది. తాజా వెర్షన్‌లో స్లిప్‌ ట్రాక్‌ ఫంక్షనాలిటీ, మెడిసిన్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ను అందుబాటులోకి తేనుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్‌ ఫీచర్లను ఇస్తుందని అంచనా. అదేవిధంగా యాపిల్‌ సర్వీసెస్‌ను మరింత విస్తృతం చేసేలా ఐఓఎస్‌ను రూపొందించిందని తెలుస్తోంది. ఐఓఎస్‌16లో యాపిల్‌ పేలో కస్టమర్ల కోసం బై నౌ, పే ల్యాటర్‌ ఫీచర్‌ తీసుకువస్తుందని ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది.


వాచ్‌ఓఎస్‌ 9 (watchOS 9)

స్మార్ట్‌వాచ్‌ల పనితీరును మరింతగా మెరుగుపరచడానికి వాచ్‌ఓఎస్‌ 9ను యాపిల్‌ ప్రవేశపెట్టబోతోంది. దీనిలో బ్యాటరీ సామర్థ్యం పెంచడానికి న్యూ పవర్‌ సేవింగ్‌ మోడ్‌ను తీసుకురానుంది. ఇప్పటికీ స్మార్ట్‌వాచ్‌లోని ‘పవర్‌ రిజర్వ్‌’ మోడ్‌లో సమయాన్ని మాత్రమే చూసుకునే వీలు ఉండేది. యాపిల్‌ తీసుకొచ్చే న్యూ పవర్‌ సేవింగ్‌ మోడ్‌లో బ్యాటరీ సామర్థ్యంపై ఎటువంటి ప్రభావం చూపకుండా టైంతో పాటు ఇతర యాప్‌లు, ఫీచర్లు వాడుకునే వెసులుబాటు ఉంటుందని టిప్‌స్టర్స్‌ తెలిపారు.


మ్యాక్‌ఓఎస్‌ (macOS 13)

యాపిల్‌ బ్రాండ్‌ మ్యాక్‌ సిస్టమ్‌ యూజర్లకు కంపెనీ కొత్త ఓఎస్‌ను తీసుకురానుంది. దీనిలో ఐదు కొత్త ఫీచర్లను అందించనుంది. వీటిలో విడ్జెట్స్‌ ఏనీవేర్‌, వెథర్‌ యాప్‌, యాప్‌ లైబ్రరీ, టైం మిషన్‌ అండ్‌ ఐక్లౌడ్‌ బ్యాకప్స్‌, టీవీఓఎస్‌ స్క్రీన్‌సేవర్స్‌ ఫర్‌ మ్యాక్‌ వంటి ఫీచర్లను కొత్తగా యూజర్లకు అందుబాటులోకి తేనుందని సమాచారం. అయితే, మ్యాక్‌ ఏయే వెర్షన్లలకు అప్‌డేట్‌లను అందిస్తుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


టీవీఓఎస్‌ 16 (tvOS 16)

యాపిల్‌ సాఫ్ట్‌వేర్‌ ఫ్లాట్‌ఫారమ్స్‌ యాపిల్‌ టీవీ, హోంప్యాడ్‌లకోసం కొత్త ఓఎస్‌ను కంపెనీ పరిచయం చేయనుంది. టీవీఓఎస్‌ 16 పేరుతో దీన్ని యూజర్ల ముందుకు తీసుకురానుంది. యాపిల్‌ టీవీ 4కే ఫస్ట్‌ జెనరేషన్‌, సెకండ్‌ జెనరేషన్‌ వాటితో పాటు ఫోర్త్‌ జెనరేషన్‌ యాపిల్‌ టీవీ ఫుల్‌ హెచ్‌డీ, హోంప్యాడ్‌ మినీ(2020), హోంప్యాడ్(2018) వంటి వాటిలోనూ కొత్త ఓఎస్‌ టీవీఓఎస్‌16 అప్‌డేట్‌ తీసుకురానుంది. వీటిలో ప్రత్యేకంగా యాపిల్‌ ఫిట్‌నెస్‌+ యాప్‌తో పాటు టీవీ యాప్‌ను ఇంప్రూవ్‌ చేసే కొన్ని కొత్త ఫీచర్లు తీసుకురానుందని సమాచారం. హోంప్యాడ్‌ 16 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో ‘సిరి’ అర్థం చేసుకునేలా మరిన్ని లాంగ్వేజ్‌లను యాడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని