SmartPhones: ప్రీమియం శ్రేణిలో ఆసుస్‌.. బడ్జెట్‌ కేటగిరీలో పోకో కొత్త మోడల్‌

ఆసుస్‌, పోకో కంపెనీలు కొత్త మోడల్‌ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేశాయి. మరి ఈ ఫోన్లల ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

Updated : 01 Mar 2022 13:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసుస్‌, పోకో కంపెనీలు కొత్త మోడల్‌ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేశాయి. ఆసుస్‌ 8జెడ్‌ మోడల్‌ను, పోకో ఎం4 ప్రో  మోడల్‌ను విడుదల చేశాయి. మరి ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధరెంత? 

ఆసుస్‌ 8జెడ్‌ సిరీస్‌: ఈ ఫోన్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 5.9 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత జెన్‌యూఐ 8 ఓఎస్‌తో పనిచేస్తుంది. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో డ్యుయెల్ స్టీరియో స్పీకర్స్, హెడ్ ఫోన్ జాక్, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, వైఫై 6ఈ ఫీచర్స్‌ ఉన్నాయి.  మార్చి 7 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 


పోకో ఎమ్‌4 ప్రో: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ హీలియో జీ96  ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో లిక్విడ్ కూల్‌ టెక్నాలజీ 1.0 ఉంది. పోకో ఎమ్‌4 ప్రో లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 2  ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను లభిస్తుంది. 6 జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ధర రూ. 16,499. 8 జీబీ ర్యామ్‌/256 జీబీ ధర రూ. 17,999. మార్చి 7 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని