
PUBG... ఇప్పుడు BGMI అవుతోందా?
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో యువతను ఓ ఊపు ఊపేసిన గేమ్ పబ్జీ. అయితే అదే స్థాయిలో విమర్శలూ ఎదుర్కొంది. అయితే గతేడాది సెప్టెంబరులో వివిధ కారణాల వల్ల యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచి ఈ గేమ్ మళ్లీ వస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గేమ్ అందుబాటులోకి రాలేదు. తాజాగా పబ్జీ అభిమానులకు ఆనందాన్నిచ్చే అప్డేట్ వచ్చేసింది. అదే పబ్జీ పేరు మార్చుకొని త్వరలో మన దేశంలో అందుబాటులోకి రానుంది. ఈ గేమ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్ ఒకటి ఇప్పుడు ఆన్లైన్లో సందడి చేస్తోంది.
ఇటీవల పబ్జీకి సంబంధించి ఏమేం జరిగాయంటే...
* PUBG గేమ్ పేరును BGMIగా మారుస్తున్నట్లు సమాచారం. PUBG అంటే మీ అందరికీ తెలిసిందే. ప్లేయర్స్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్. అయితే BGMI అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా.
* పబ్జీ గతంలో బ్యాన్ చేయడానికి ముఖ్య కారణం ప్రైవసీ. భారతీయుల డేటాను పబ్జీ ఇతర దేశానికి ఇచ్చేస్తోందనేది అపవాదు. దీంతో టెన్సెంట్ గేమ్స్‌తో ఉన్న డీల్ రద్దు చేసుకొని పబ్జీ క్రాఫ్టన్ అనే సంస్థతో జట్టు కట్టింది. మైక్రోసాఫ్ట్‌కు చెంది అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఇప్పుడు డేటాను భద్రపరుస్తారట.
* ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 69A సెక్షన్ కింద టిక్, కామ్ స్కానర్, పబ్జీ తదితర యాప్‌లను ప్రభుత్వం గతంలో నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం యాప్స్‌లో ప్రస్తుతం పబ్జీ ఒక్కటే మన దేశంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తోంది.
* కొన్ని రోజుల క్రితం పబ్జీ యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో అప్లోడ్ చేశారు. అందులో పబ్జీ త్వరలో వస్తోంది అని చెబుతూ కొన్ని ఇమేజెస్ కనిపించాయి. అయితే కొద్ది రోజుల్లోనే దానిని డిలీట్ చేశారు.
* తాజాగా పబ్జీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పేజీల్లో పేరును బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని మారుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే కంపెనీలోకి కొంతమంది మార్కెటింగ్, పీఆర్ ఉద్యోగులను తీసుకున్నారు.
* కొత్త పబ్జీ మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంలో ఇంకా సరైన స్పష్టత అయితే రావడం లేదు. ప్రచారం, పేర్లు మార్పు లాంటివి చూస్తుంటే త్వరలో మళ్లీ యువత మొబైల్స్ గన్స్పేలుడు, బాంబుల మోతతో నిండిపోనుంది అని మాత్రం తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.