Wireless Earbuds: ₹5వేల లోపు ఇయర్‌ బడ్స్‌ కొనాలనుకుంటున్నారా.. ఆప్షన్స్‌ ఇవే!

బడ్జెట్‌ ధరల్లో డిఫరెంట్‌ ఫీచర్స్‌తో ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇయిర్‌బడ్స్‌ను విడుదల చేశాయి. మరి బడ్జెట్‌ ధరల్లో రూ. ఐదు వేలలోపు అందుబాటులో ఉన్న ఇయిర్‌బడ్స్‌ ఏంటో?

Updated : 09 May 2022 20:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇయర్‌బడ్స్‌.. ప్రస్తుతం ప్రతి ఒక్క స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌కి ముఖ్యమైన యాక్ససెరీగా మారిపోయింది. రకరకాల డిజైన్స్‌లో, అవసరమైన సైజుల్లో, బడ్జెట్‌ ధరల్లో డిఫరెంట్‌ ఫీచర్స్‌తో ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇయర్‌బడ్స్‌ను విడుదల చేశాయి. యూజర్లను ఆకట్టుకుంటూ.. రూ. ఐదు వేలలోపు బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉన్న ఇయర్‌బడ్స్‌ ఏంటో? వాటి ఫీచర్లేంటో? ఓసారి చూద్దాం!


వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 (OnePlus Buds Z2)

చైనీస్‌ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 పేరుతో గతంలో ఇయర్‌బడ్స్‌ని పరిచయం చేసింది. కంపెనీ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్ (టీడబ్లూఎస్‌) శ్రేణిలో ఇది మూడో మోడల్‌. వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 ఎయిర్‌బడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉంది. అంతేకాకుండా ఈ బడ్స్‌ 40 డెసిబుల్స్ వరకు నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను ఇస్తాయి. ఇందులో హెవీ బేస్‌ కోసం 11ఎమ్‌ఎమ్‌ డ్రైవర్స్ ఉపయోగించారు. అలానే మెరుగైన కాలింగ్ అనుభూతి కోసం మూడు మైక్‌లు ఇస్తున్నారు.

ఇయర్‌బడ్స్‌లో 40 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఛార్జింగ్‌ కేస్‌లో 520 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 38 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. అలానే ఇయర్‌బడ్స్‌ను 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 5 గంటలపాటు పనిచేసేందుకు అవసరమయ్యే ఛార్జింగ్‌ అందుతుంది. నీటిలో తడిచినా పాడవకుండా ఉండేందుకు ఐపీ55 ప్రొటెక్షన్ ఉంది. వీటి ధరను రూ.4,599గా కంపెనీ నిర్ణయించింది.


నథింగ్‌ ఇయర్‌ (1)

నథింగ్‌ కంపెనీ నథింగ్ ఇయర్‌ 1 పేరుతో కొత్త ఇయర్‌ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో స్మార్ట్‌ అడాప్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తోపాటు మూడు హై డెఫినిషన్ మైక్‌లు ఉన్నాయి. ఇందులో 11.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇయర్‌బడ్స్‌ని ఛార్జ్‌ చేసేందుకు యూఎస్‌బీ-సీ టైప్ ఛార్జర్‌ ఇచ్చారు. ఇది క్యూఐ వైరస్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇయర్‌బడ్స్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్‌ కేస్‌తో 34 గంటలపాటు బ్యాటరీ స్టాండ్‌బైలో ఉంటుంది. వీటిని పది నిమిషాలు ఛార్జ్ చేస్తే 8 గంటలపాటు మ్యూజిక్‌ని ఆస్వాదించవచ్చు. ఆన్‌లైన్‌ రిటైల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో వీటి ధర రూ.5,000గా ఉంది.


జేబీఎల్‌ సీ115 (JBL C115)

జేబీఎల్‌ కంపెనీ జేబీఎల్‌ సీ115 పేరుతో గతంలో ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఇందులో జేబీఎల్‌ ప్యూర్‌ బేస్‌ సౌండ్‌ కోసం 5.8ఎమ్‌ఎమ్‌ డ్రైవర్స్‌ను ఉపయోగించారు. ఎయిర్‌బడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉంది. అంతేకాకుండా వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ కూడా ఉంటుంది. ఇందులో అటానామస్‌ కనెక్టివిటీ ఫీచర్‌ అందుబాటులో ఉంది. మోనో, స్టిరియో మోడ్స్‌లో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 21 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. అలానే ఇయర్‌బడ్స్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఒక రోజంతా పనిచేసేందుకు అవసరమయ్యే ఛార్జింగ్‌ అందుతుంది. వీటి ధరను రూ.3,999గా కంపెనీ నిర్ణయించింది.


రియల్‌మీ బడ్స్‌ క్యూ2 (Realme Buds Q2)

ప్రస్తుతం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్న అత్యంత చౌకైన ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌లో రియల్‌మీ బడ్స్‌ క్యూ2 కూడా ఒకటి. ఇందులో 10ఎమ్‌ఎమ్‌ డైనమిక్‌ డ్రైవర్‌ను ఉపయోగించారు.ఈ బడ్స్‌ 25 డెసిబుల్స్ వరకు నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను ఇస్తాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 28 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. 10 నిమిషాల పాటు ఛార్జ్‌ చేసి 3గంటలపాటు పాటలు వినొచ్చు. నీటిలో తడిచినా పాడవకుండా ఉండేందుకు ఐపీఎక్స్‌5 ప్రొటెక్షన్ ఉంది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్, వాయిస్ కాల్స్‌కు డ్యూయల్ మైక్రోఫోన్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇందులో ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్ 5.2, ఎస్‌బీసీ, ఏఏసీ బ్లూటూత్ కోడెక్‌లను ఇవి సపోర్ట్ చేస్తాయి. వీటి ధర రూ. 1,999గా ఉంది. 


ఒప్పో ఎంకో బడ్స్‌ (Oppo Enco Buds)

బడ్జెట్‌ ధరలో ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ కొనాలనుకునే వారికి  ఒప్పో ఎంకో బడ్స్‌ మరొక ఆప్షన్‌. ఇందులో ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్‌ ఆడటానికి వీలుగా లో లాటెన్సీ గేమింగ్‌ మోడ్‌ను ఇచ్చారు. వీటలో 8ఎమ్‌ఎమ్‌ డైనమిక్‌ డ్రైవర్‌ను ఉపయోగించారు. బ్యాటరీ లైఫ్‌ 24 గంటలపాటు ఉంటుంది. ఓపెన్‌ అప్‌ ఆటో కనెక్షన్‌, బ్లూటూత్‌ 5.2 వెర్షన్‌, యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌ చేస్తుంది. వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ54 ప్రొటెక్షన్‌ ఉంటుంది. వీటి ధరను రూ. 1,699గా కంపెనీ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని