ఏడు స్క్రీన్‌లతో ల్యాప్‌టాప్.. చూశారా?

బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌పాన్‌స్కేప్‌ అనే కంపెనీ ఏడు స్క్రీన్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను తయారుచేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఏడు స్క్రీన్‌లు ఉన్న తొలి ల్యాప్‌టాప్‌.......

Published : 13 Feb 2021 09:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌పాన్‌స్కేప్‌ అనే కంపెనీ ఏడు స్క్రీన్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను తయారుచేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఏడు స్క్రీన్‌లు ఉన్న తొలి ల్యాప్‌టాప్‌ ఇదేనట. డేటా సైంటిస్టులు, కంటెంట్ క్రియేటర్స్, సైబర్ నిపుణులకు ఈ ల్యాప్‌టాప్‌ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే పలువురు ఈ ల్యాప్‌టాప్ కోసం ముందస్తు ఆర్డర్ చేశారట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను త్వరలోనే పూర్తిస్థాయిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారట.

సాంకేతికత పరంగా ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ఐ9 9900కే ప్రాసెసర్ ఉపయోగించారు. 64 జీబీ ర్యామ్‌, 2టీబీ స్టోరేజ్  ఇస్తున్నారు. ఇందులోని ఏడు స్క్రీన్‌లలో నాలుగు 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌లు, మిగిలిన మూడు 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌లు. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గంటపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు. చూసేందుకు బాక్స్‌ తరహాలో ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌లు తెరుచుకునేందుకు మొత్తం 13 దశల అన్‌ఫోల్డింగ్ వ్యవస్ధ ఉంది. దీని సహాయంతో అవసరమైన స్క్రీన్‌లను మాత్రమే తెరిచి పనిచేసుకోవచ్చు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్‌లలో పనిచేయాలనుకునేవారు ఈ ల్యాప్‌టాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

ఇవీ చదవండి..

స్వచ్ఛ కంప్యూటర్‌కు పంచ సూత్రాలు..

యాపిల్ వాచ్‌తో కొవిడ్-19 లక్షణాల గుర్తింపు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని