Updated : 28/11/2021 22:17 IST

Starlink Internet: ‘స్టార్‌లింక్’కు సబ్‌స్క్రైబ్‌ అవ్వొద్దు.. యూజర్లకు కేంద్రం సూచన

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం సబ్‌స్క్రైబ్‌ చేసుకోవద్దని యూజర్లకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీఓటీ) సూచించింది. స్టార్‌లింక్‌ తమ నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని డీఓటీ స్పష్టం చేసింది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే స్టార్‌లింక్‌ వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్స్‌కు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఓటీ తెలిపింది. కాబట్టి వినియోగదారులెవరూ ఈ సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దని సూచించింది.

‘‘స్టార్‌లింక్‌ సంస్థ భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూజర్స్ ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చని తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఏ సంస్థా భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందలేదు. యూజర్స్ ఈ విషయాన్ని గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు సంబంధించి అనుసరించే విధివిధానాలను డీవోటీకి సమర్పించాలని స్టార్‌లింక్ సంస్థను కోరాం’’ అని కేంద్ర సమాచారశాఖ ప్రకటనలో పేర్కొంది. కొద్దిరోజుల క్రితం శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్‌లో పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు స్టార్‌లింక్ తెలిపింది. ఇందులో భాగంగా ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవద్దని డీవోటీ ట్వీట్‌ చేసింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని