Published : 29/10/2021 23:02 IST

iPhone Charger: ఐఫోన్‌తో ఛార్జర్‌ ఇవ్వలేదని యాపిల్‌ సంస్థపై కేసు

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్బన ఉద్గారాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఐఫోన్‌తో పాటు ఛార్జర్‌ను ఇవ్వడం లేదని యాపిల్ సంస్థ ప్రకటించింది. అందులో భాగంగానే గతేడాది విడుదలైన ఐఫోన్ 12లో ఛార్జర్‌ను తొలగించింది. అలానే ఇయర్‌ఫోన్స్‌ను కూడా ఉచితంగా ఇవ్వడంలేదని చెప్పింది. అప్పట్లో దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా యూజర్స్‌ నుంచి విమర్శలు వ్యక్తం అయినప్పటికీ యాపిల్ తన చర్యలను సమర్థించుకుంది. తాజాగా ఇదే యాపిల్‌ను చిక్కుల్లో పడేసింది. ఫోన్‌తోపాటు ఛార్జర్‌ ఇవ్వడంలేదని చైనాకు చెందిన ఐదుగురు యూనివర్శిటీ విద్యార్థులు అక్కడి కోర్టులో దావా వేశారు.

చైనాకు చెందిన ఓ విద్యార్థిని ఇటీవల ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను కొనుగోలు చేసింది. అయితే అందులో ఛార్జర్‌ లేదని, ఫోన్‌తో పాటు ఇస్తున్న యూఎస్‌బీ-సీ లైటెనింగ్ కేబుల్ అన్ని ఛార్జర్లతో పనిచేయడంలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. అలానే యాపిల్‌ కొత్తగా తీసుకొస్తున్న మాగ్‌సేఫ్‌ ఛార్జర్‌ల ప్రచారం కోసమే ఛార్జర్‌లను తొలగించిదని ఆరోపించింది. యాపిల్‌ ఛార్జర్‌ తొలగించాలనే ఆలోచన..  పరోక్షంగా యూజర్లు మాగ్‌సేఫ్ ఛార్జర్లు కొనేలా ప్రోత్సహించడమేనని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై యాపిల్ తరపు న్యాయవాది మాత్రం ఫోన్‌తో పాటు ఛార్జర్‌ ఇవ్వడంలేదనే విషయం ఫోన్‌ బాక్స్‌పై ఉంటుందని వాదించారు. అలానే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కంపెనీలు ఫోన్‌తోపాటు ఛార్జర్‌ ఇవ్వడంలేదని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ కేసుపై చైనా సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

గతేడాది అక్టోబర్లో‌ ఐఫోన్ 12 సిరీస్‌ విడుదల సందర్భంగా యాపిల్ ఐఫోన్‌లతో పాటు ఛార్జర్ ఇవ్వడంలేదని వెల్లడించింది. దీనివల్ల రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని, ఇవి సుమారు ఐదు కోట్ల కార్లు విడుదల చేసే కార్బన్‌తో సమానమని తెలిపింది. అయితే ఈ ఏడాది మార్చిలో యాపిల్ ఫోన్‌తో పాటు ఛార్జర్‌ ఇవ్వడంలేదని బ్రెజిల్‌ వినియోగదారుల ఫోరం (ప్రోకాన్-ఎస్‌పీ) యాపిల్‌కు 2 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15కోట్ల) జరిమానా విధించింది. ఫోన్‌తోపాటు ఛార్జర్‌ ఇవ్వకపోవడం కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించడమేనని ఆ సందర్భంలో వ్యాఖ్యానించింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని