Google: మళ్లీ 8 ఏళ్ల తర్వాత ‘క్రోమ్‌’ కొత్త లోగో..!

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన క్రోమ్‌ బ్రౌజర్‌ లోగోలో స్వల్ప మార్పులు చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత..

Published : 06 Feb 2022 21:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన క్రోమ్‌ బ్రౌజర్‌ లోగోలో స్వల్ప మార్పులు చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బ్రౌజర్‌ లోగోలో కంపెనీ ఈ మార్పులు చేయడం విశేషం. రీడిజైన్‌కు సంబంధించి క్రోమ్‌ లోగో ఫస్ట్‌ లుక్‌ను డిజైనర్‌ ఎల్విన్‌ హు ట్వీట్‌ చేశాడు. ఈ మేరకు ‘‘ క్రోమ్‌ కొత్త ఐకాన్‌ను మీరు ఇవాళ గమనించే ఉంటారు. 8 ఏళ్ల తర్వాత క్రోమ్‌ బ్రాండ్‌ ఐకాన్‌ను రిఫ్రెష్‌ చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

పాత క్రోమ్‌ లోగో మాదిరి కొత్త బ్రాండ్‌ ఐకాన్‌లో షాడోలు లేవు. లోగోలో వినియోగించిన నాలుగు రంగులు మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. మధ్యలోని నీలిరంగు వృత్తం కొంచం పెద్దదిగా కనిపిస్తుంది. విండోస్‌తో సహా వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల కోసం ఈ లోగోను తీర్చిదినట్టు ఎల్విన్‌ హు పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో డెస్క్‌టాప్‌, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్ల అందరికీ ఈ లోగోలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా, 2008లో క్రోమ్‌ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలుత 2011, 2014 ఏడాదిలో లోగోలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని