Chrome: ఇక వెబ్‌ పేజీని క్రోమ్‌ చదివి పెడుతుంది

ఆండ్రాయిడ్‌ పరికరాల్లో గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి శుభవార్త. ఇప్పుడు దీనికి కొత్తగా లిజన్‌ టు దిస్‌ పేజ్‌ ఫీచర్‌ తోడైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది వెబ్‌పేజీని బిగ్గరగా చదివి వినిపిస్తుంది. 

Published : 26 Jun 2024 00:28 IST

ఆండ్రాయిడ్‌ పరికరాల్లో గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి శుభవార్త. ఇప్పుడు దీనికి కొత్తగా లిజన్‌ టు దిస్‌ పేజ్‌ ఫీచర్‌ తోడైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది వెబ్‌పేజీని బిగ్గరగా చదివి వినిపిస్తుంది. 

క్రోమ్‌ యాప్‌లో లిజన్‌ టు దిస్‌ పేజ్‌ ఫీచర్‌ ఇమిడిపోయి ఉంటుంది. మూడు చుక్కల మెనూ గుర్తు ద్వారా ఈ ఫీచర్‌ను చేరుకోవచ్చు. దీన్ని వాడుకోవాలని అనుకున్నప్పుడు మినీ ప్లేయర్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ప్లే/పాజ్‌ బటన్లు, ప్రోగ్రెస్‌ బార్, ప్లేబ్యాక్‌ స్పీడ్‌ ఆప్షన్లు కూడా ఉంటాయి. దీని సాయంతో వెబ్‌పేజీని వేర్వేరు గొంతుల్లో, వేర్వేరు భాషల్లో కూడా వినొచ్చు. స్క్రీన్‌ లాక్‌ అయినా కూడా ఆడియో వినిపించటం విశేషం. ప్రస్తుతం కొద్దిమందికే పరిమితమైన ఈ ఫీచర్‌ త్వరలో విస్తృతంగా అందుబాటు లోకి రానుంది. గూగుల్‌ క్రోమ్‌ వర్షన్‌ 125తో పాటు దీన్ని అమలు చేయనున్నారు. ఇది అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, జపనిస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్‌ వంటి రకరకాల భాషల్లోని వెబ్‌ పేజీలను సపోర్టు చేస్తుంది. దీన్ని ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలంటే?

  • ఆండ్రాయిడ్‌ పరికరంలో గూగుల్‌ క్రోమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. 
  • టెక్స్ట్‌తో కూడిన వెబ్‌ పేజీని ఓపెన్‌ చేయాలి. అయితే పేజీలో టెక్స్ట్‌ ఎక్కువగా ఉండాలి.
  • పేజీ పూర్తిగా లోడ్‌ అయ్యాక, పైన కుడిమూలన కనిపించే నిలువు మూడు చుక్కల గుర్తు మీద తాకాలి. 
  • డ్రాప్‌ డౌన్‌ మెనూలో లిజన్‌ టు దిస్‌ పేజ్‌ ఆప్షన్‌ మీద తట్టాలి.
  • ప్లేబ్యాక్‌ స్పీడ్‌ను మార్చుకోవాలంటే మినీ ప్లేయర్‌ను తాకాలి. ప్లేయర్‌ విండోలో కింద కుడివైపున కనిపించే మూడు నిలువు చుక్కల మీద తాకాలి. తర్వాత ప్లేబ్యాక్‌ స్పీడ్‌ను ఎంచుకొని, మార్చుకోవాలి.
  • గొంతు మార్చుకోవాలంటే- వాయిస్‌ మీద తాకి ప్రివ్యూను తడితే గొంతు నమూనాలు వినిపిస్తాయి. హైలైట్‌ టెక్స్ట్‌ అండ్‌ ఆటో స్క్రోల్‌ను తాకి ఎనేబుల్‌ చేసుకోవాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని