Clubhouse APP: ఇన్‌వైట్‌ చేయక్కర్లేదు..రిక్వెస్ట్ అవసరం లేదు..డైరెక్ట్‌ లాగిన్‌

ఆడియో మెసేజింగ్ యాప్ క్లబ్‌హౌస్ సరికొత్త మార్పులతో యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్‌ యాప్‌ను విడుదలచేసిన క్లబ్‌హౌస్, కొద్దిరోజుల క్రితం యాప్‌లో బ్యాక్‌ఛానల్ పేరుతో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను యూజర్స్‌కి పరిచయం చేసింది...

Published : 22 Jul 2021 23:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆడియో మెసేజింగ్ యాప్ క్లబ్‌హౌస్ సరికొత్త మార్పులతో యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్‌ యాప్‌ను విడుదల చేసిన క్లబ్‌హౌస్, కొద్దిరోజుల క్రితం యాప్‌లో బ్యాక్‌ ఛానల్ పేరుతో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను యూజర్స్‌కి పరిచయం చేసింది. ఇకమీదట యాప్‌లోని ఇన్విటేషన్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు క్లబ్‌హౌస్‌ ట్వీట్ చేసింది. గతంలో కొత్తగా ఈ యాప్‌ను ఉపయోగించాలకునే వారు రిజిస్టర్‌ అయ్యాక..మీకు వచ్చిన ఇన్వైట్ రిక్వెస్ట్‌ని క్లబ్‌హౌస్‌లో అప్పటికే ఉన్నవారు నామినేట్ చేస్తే మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది. తర్వాత మీరు ఖాతాను ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిపై చాలా మంది యూజర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  దీంతో క్లబ్‌హౌస్‌ ఏడాది కాలంగా ఈ పద్ధతిని తొలగించడంపై దృష్టిసారించింది. తాజాగా ఇన్వైట్ వెయిటింగ్ లిస్ట్ ఫీచర్‌ను తొలగించింది. ఇకనుంచి యూజర్స్ నేరుగా లాగిన్ కావచ్చు. 

కరోనా కారణంగా ఎక్కువ మంది ఇంటికే పరిమితం కావడంతో ఈ ఆడియో మెసేజింగ్ యాప్‌ను ఎక్కువ మంది ఉపయోగించారు. తర్వాత ట్విటర్, ఫేస్‌బుక్ కూడా ఆడియో మెసేజింగ్ ఫీచర్‌ను తీసుకురావడం, లాగిన్‌ సులువుగా ఉండటంతో యూజర్స్ క్రమంగా వాటివైపు మొగ్గుచూపారు. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం క్లబ్‌ హౌస్‌ యాప్ విడుదల చేసిన తర్వాత సుమారు 80 లక్షల మంది కొత్త యూజర్స్ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారట. అంతేకాకుండా 5 వేల మందితో చాట్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ క్లబ్‌ హౌస్‌లో ఉంది. తాజాగా లాగిన్ కష్టాలు తొలగిపోవడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని క్లబ్‌హౌస్‌ భావిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని