Club house: క్లబ్‌హౌజ్‌లో మరో అప్‌డేట్.. కొత్తగా ‘వైల్డ్‌ కార్డ్స్‌’ గేమ్‌ ఫీచర్‌!

ప్రముఖ ఆడియో చాట్‌ యాప్‌ క్లబ్‌హౌజ్‌ యూజర్ల కోసం కొత్తగా గేమ్‌ రూమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది

Updated : 11 May 2022 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆడియో చాట్‌ యాప్‌ క్లబ్‌హౌజ్‌ మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. యూజర్ల కోసం కొత్తగా గేమ్‌ రూమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు ఇతరులతో తమ అభిప్రాయాలను పంచుకునేలా ‘వైల్డ్‌ కార్డ్స్‌’ పేరుతో గేమ్‌ను పరిచయం చేసింది. యూజర్లు ఒకరినొకరు సులువుగా తెలుసుకోవడానికి దీన్ని రూపొందించింది. ఈ గేమ్‌ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ తరహాలో సాగుతుంది. దీనికి నిర్దిష్ట కాలపరిమితి కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్‌ భాషలోనే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర భాషల్లోకి తీసుకువస్తారని తెలుస్తోంది.

ఎలా స్టార్ట్‌ చేయాలి?

క్లబ్‌ హౌజ్‌లో ‘వైల్డ్‌ కార్డ్స్‌’ గేమ్‌ను ప్రారంభించాలంటే +Room బటన్‌పై క్లిక్‌ చేసి ‘Games’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. అప్పుడు సోషల్‌రూమ్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్‌ను ఇన్వైట్‌ చేసుకోవాలి. ఇన్వైట్‌ చేసిన ఫ్రెండ్స్‌ అందరూ వచ్చాక ‘గేమ్‌ స్టార్ట్‌’ బటన్‌ పై క్లిక్‌ చేసి గేమ్‌ ప్రారంభించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు