మీ ఫోన్‌ చల్లగుండ!

ఎండాకాలం వచ్చేసింది. వేడి వాతావరణంలో స్మార్ట్‌ఫోన్‌ మరింత వేడెక్కే అవకాశముంది. ఫోన్‌ ప్రాసెసర్‌, తెర, జీపీఎస్‌, బ్యాటరీ వంటివి ఎక్కువ వేడిని పుట్టిస్తాయి.

Published : 22 Mar 2023 00:03 IST

ఎండాకాలం వచ్చేసింది. వేడి వాతావరణంలో స్మార్ట్‌ఫోన్‌ మరింత వేడెక్కే అవకాశముంది. ఫోన్‌ ప్రాసెసర్‌, తెర, జీపీఎస్‌, బ్యాటరీ వంటివి ఎక్కువ వేడిని పుట్టిస్తాయి. దీన్ని బయటి వేడి ఇంకాస్త ఎక్కువ చేస్తుంది. ఫోన్‌ మరీ వెడెక్కితే బ్యాటరీ, లోపలి భాగాలు దెబ్బతినొచ్చు. మొత్తంగా ఫోన్‌ సామర్థ్యమే తగ్గొచ్చు. అతిగా వేడెక్కితే పేలి పోవచ్చు కూడా. అందువల్ల ఫోన్‌ వేడెక్కకుండా చూసుకోవటం మంచిది.

* స్మార్ట్‌ఫోన్‌ బాగా వేడెక్కినప్పుడు బ్యాక్‌ కవర్‌ను తొలగించటం మంచిది. అలాగే 30-45 నిమిషాల సేపు స్విచాఫ్‌ చేయాలి. దీంతో ఫోన్‌ నెమ్మదిగా చల్లబడుతుంది.

ఫోన్‌కు నేరుగా ఎండ తగలనీయొద్దు. కారు డ్యాష్‌బోర్డులోనూ పెట్టొద్దు. దీంతో ఉష్ణోగ్రత పెరిగి మరింత వేడెక్కే ప్రమాదముంది. ఫోన్‌ను ఫ్యాన్‌ కింద గానీ చలువరాయి మీద గానీ పెడితే క్రమంగా చల్లబడుతుంది.

వేడిగా ఉన్న చోట్ల గేమ్స్‌ ఆడటం, వీడియోలు చిత్రీకరించటం చేయొద్దు. సినిమాలు చూస్తున్నప్పుడు ఫోన్‌ను దిండు మీద పెట్టొద్దు.

ఫోన్‌కు మందమైన బ్యాక్‌ కవర్‌ ఉంటే ఛార్జింగ్‌ చేస్తున్నప్పుడు తొలగించాలి. లేకపోతే ఫోన్‌ బాగా వేడెక్కే ప్రమా దముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని