Cyber security: కొత్త ఏడాదిలో మీ ‘డిజిటల్‌ లైఫ్‌’ను కాపాడుకోండిలా..!

మరి మీ డిజిటల్‌ లైఫ్‌ ఎంటో మీకు తెలుసా? అది భద్రంగా ఉందని మీరు భావిస్తున్నారా?లేదంటే..

Published : 01 Jan 2022 14:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడంతా మొబైల్స్‌దే రాజ్యం! ముఖ్యమైన డాక్యుమెంట్ల నుంచి బ్యాంక్‌ ఖాతాల వివరాల దాకా ఎవరేది దాచాలన్న మొబైల్లోనే!! అదే సమయంలో ఈ డిజిటల్‌ లైఫ్‌లో ఇలాంటి సున్నితమైన సమాచారం కాపాడుకోవడమంటే మామూలు విషయం కాదు. గతేడాది మీరో, మీకు తెలిసిన వాళ్లో సైబర్‌ నేరగాళ్ల వల్ల ఇబ్బందులు పడే ఉంటారు. అయినా పాఠాలు నేర్వకపోతే ఎలా? అందుకే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినప్పుడైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. మన ‘డిజిటల్‌ లైఫ్‌’ను కాపాడుకుందాం.. 

* అనుమానాస్పదంగా అనిపించే యాప్‌లు‌, ఈమెయిల్స్‌, వ్యక్తిగత సమాచారం అడిగే లింక్‌ల జోలికి కొత్త ఏడాదిలో అస్సలు వెళ్లకండి. అలాగే పైరసీ మీడియాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి తరచూ ప్రమాదకర స్పైవేర్లను మొబైల్స్‌లోకి జొప్పిస్తాయి.

పండగలు, ప్రత్యేక రోజుల్లో గిఫ్ట్‌ల పేరిట సామాజిక మాధ్యమాల్లో వచ్చే లింక్‌లు, వ్యక్తిగత సమాచారం అడిగే వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి.

* కొన్ని సందర్భాల్లో ఫోన్‌ సిస్టమ్‌, యాప్స్‌లోని పలు సాంకేతిక లోపాల కారణంగా మనం సైబర్‌ మోసాల బారిన పడతాం. అలాకాకుండా ఉండాలంటే ఫోన్‌ సిస్టమ్‌తో పాటు యాప్‌లను ఎప్పుటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండండి. తద్వారా హ్యాకర్ల దాడి నుంచి తప్పించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ‘ఆటో అప్‌డేట్‌ యాప్స్‌’ను ఆన్‌ చేసుకోవడం ఉత్తమం. 

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో డేటా చౌర్యం కాకుండా ఉండటానికి మీ పాస్‌వర్డ్‌లు కూడా మీకు రక్షణ కల్పిస్తాయి. మీ లాక్‌ స్క్రీన్‌తో పాటు, యాప్స్, సోషల్‌ నెట్‌వర్క్‌, బ్యాంక్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా మీ మొబైల్‌పై దాడి చేసిన హ్యాకర్లు.. పాస్‌వర్డ్‌లను అంతా ఈజీగా క్రాక్‌ చేయలేరు. మరీ ముఖ్యంగా మీ మొబైల్స్‌లో ఏ పాస్‌వర్డ్‌ అయినా స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలన్న విషయాన్ని మరవొద్దు.

* వైఫై (Wi-Fi) దొరికింది కదా కొందరు విపరీతంగా వాడేస్తుంటారు. ప్రత్యేకించి వైఫై, ఉచిత హాట్‌స్పాట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత ఎక్కువ సేపు వైఫై వాడటం.. హాట్‌స్పాట్‌లను వినియోగించడం అంత మంచిది కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని