ఈ యాప్ వాడు.. మొబైల్ తక్కువగా చూడు!
డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ ప్రయత్నించండి. మొబైల్ వాడకాన్ని తగ్గించేయండి...
అర నిమిషం ఖాళీ దొరికితే అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తోంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. అంతలా ఫోన్‌కి బానిసలయ్యాం. మొబైల్ ఎక్కువగా వినియోగిస్తే దీర్ఘ కాలంలో మానసిక, ఆరోగ్య సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నా, ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు. మీ పరిస్థితి ఇలానే ఉన్నా, లేకపోతే మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నా... సింపుల్‌గా ఈ డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్‌ని ప్రయత్నించండి. మొబైల్ వాడకాన్ని తగ్గించేయండి.
- ఇంటర్నెట్ డెస్క్
మీకు నచ్చిన సమయానికి రప్పిద్దాం...
నిమిషానికో వాట్సాప్ మెసేజ్, అరగంటకో ఫేస్బుక్ నోటిఫికేషన్, గంటకో యూట్యూబ్ అప్డేట్.. ఇలా నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి వరుస కట్టి, మీ సమయాన్ని తినేస్తున్నాయా! అయితే నోటిఫికేషన్లన్నీ ఒకేసారి వచ్చేట్టుగా చేస్తే సరి. దాని కోసం Post Box యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు నచ్చే సమయాన్ని ఎంచుకుని, అప్పుడే నోటిఫికేషన్లు వచ్చేట్టుగా చేయొచ్చు. అంటే రోజులో మీకు అనుకూలమైన సమయానికే మొత్తం నోటిఫికేషన్లు వస్తాయి. టింగ్, టింగ్ మంటూ వరుస నోటిఫికేషన్లు రావు. దీంతో మీ పని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఫోన్‌కి దూరంగా ఉండొచ్చు.
సమయం సమాప్తం...
రోజులో ఏ యాప్‌కి ఎంత సమయం కేటాయించారు? ఫోన్‌ని ఎన్నిసార్లు అన్‌లాక్ చేశారు? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి? మొత్తంగా రోజులో స్మార్ట్‌ఫోన్‌కి ఎంత సమయం కేటాయించారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే Digital Wellbeing యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఫోన్లోని ప్రతి యాప్‌కి నిడివిని సెట్ చేసి, అంతసేపే వాడేలా టైమర్ ఏర్పాటు చేయొచ్చు. ఉదాహరణకు యూట్యూబ్‌కి గంట కేటాయిస్తే, నిర్ణీత సమయం తర్వాత యాప్ పాజ్ అవుతుంది. ‘మీ సమయం పూర్తైంది. తిరిగి రేపు కలుద్దాం’ అనే పాప్అప్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇలా షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని యాప్‌లకు కేటాయించే సమయాన్ని తగ్గించొచ్చు. ఫోన్ వాడకాన్ని నియంత్రించొచ్చు.
ఎక్కడివి అక్కడే?
నిద్రపోతున్నప్పుడు వాట్సాప్ మెసేజ్ వచ్చింది... ఏంటా అని ఫోన్ అన్‌లాక్ చేసి, ఓ గంట మొబైల్ వాడేసేవాళ్లు చాలామందే ఉన్నారు. ఆఫీసు, ఇంటి పని మధ్యలో ఇలా మీరూ యాప్స్ తెరుస్తున్నారా? అయితే ఈ యాప్ మీ కోసమే. పేరు Morph. ఇది మీ ఫోన్లో యాప్‌ల వాడకాన్ని నియంత్రిస్తుంది. మీ స్థలం, సమయానికి అనుగుణంగా మీకు అవసరమయ్యే యాప్స్ అందుబాటులో ఉంచుతుంది. దీంతో ఇంట్లో ఉండగా ఇంటి పని, ఆఫీసులో ఉండగా ఆఫీసు పనికి సంబంధించిన యాప్స్ మాత్రమే తెరిచే వీలుంటుంది. అవసరాన్ని బట్టి ఏ యాప్‌కి ఎంత సమయాన్ని కేటాయించాలో మీరే సెట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ యాప్ వాడాలనేది మీరు ముందుగా యాప్‌లో సెట్ చేసుకోవాలి.
ఎన్ని బుడగలో...
నిద్ర లేచిన దగ్గరి నుంచి, తిరిగి రాత్రి నిద్రపోయేవరకు మీ ఫోన్‌ని ఎంతసేపు వాడారో తెలుసా. కచ్చితంగా చెప్పలేం అంటారా? అయితే Activity Bubbles యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోండి. అదే మీ మొబైల్ వినియోగం ఎంతలా ఉందో చూపిస్తుంది. ఒక రోజులో మీ ఫోన్ ఎంతగా వాడారో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని, వాల్‌పేపర్ ఆప్షన్‌లోకి వాల్‌పేపర్‌గా సెట్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఫోన్ అన్‌లాక్ చేయగానే ఓ బుడగ వస్తుంది. మీరెంత సమయం ఫోన్‌తో గడిపితే ఆ బుడగ పరిమాణం అంత పెద్దదిగా ఉంటుంది. ఆ తర్వాత అన్‌లాక్ చేసిన ప్రతిసారి బుడగలు వస్తుంటాయి. అలా ఎంత సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారో తెలుసుకోవచ్చు. రోజు రోజుకి ఆ సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఫోన్ వాడకాన్నీ తగ్గించొచ్చు.
అడవిని సృష్టించొచ్చు
పనిలో ఉండగా మాటిమాటికి ఫోన్ వైపు చూస్తున్నారా? అరగంటకోసారైనా ఫోన్‌ని తాకకుండా చేతులు ఊరుకోవడం లేదా? అయితే ఓ మొక్కనాటి ఈ సమస్యకి చెక్ పెట్టండి. అదేంటి ఫోన్‌కి మొక్కకి సంబంధం ఏంటంటారా? ఆ పని Forest యాప్‌తో సాధ్యమే. ఇందులో సమయాన్ని సెట్ చేసుకొని ఓ మొక్కను నాటి, మీ పని ప్రారంభించాలి. ఈ క్రమంలో మీరు ఎంచుకున్న సమయం వరకూ ఫోన్‌ని తాకకూడదు. అలా చేస్తే మొక్క ఎదుగుతుంది. లేదంటే మొక్క చనిపోతుంది. అలా పనిని ప్రారంభించి సమయానుగుణంగా పూర్తి చేస్తూ అనేక మొక్కలు నాటొచ్చు. ఓ అడవిని సృష్టించొచ్చు. ఇలా పనిలో ఉండగా ఏకాగ్రత కోసం ఈ యాప్‌ని వాడొచ్చు.
స్టాప్‌వాచ్ ఆపేద్దాం..
పని సమయాల్లో, నిద్రించే ముందు, చదివేటప్పుడు ఇలా ఏ సమయంలో అయినా చూపులన్నీ ఫోన్ అన్లాక్పైనే, ఆలోచనలన్నీ మొబైల్ తెరపైనే. మరి మొబైల్ వినియోగంలో గడిపే సమయాన్ని తగ్గించాలంటే ఈ యాప్ ప్రయత్నించొచ్చు. పేరు Screen Stopwatch. రోజూ మీరెంత సమయం మొబైల్ తెరపై గడుపుతున్నారో ఈ యాప్ చెబుతుంది. ఫోన్ అన్‌లాక్ చేయగానే, స్క్రీన్‌పై కనిపించే వాచ్ తన పని మొదలెడుతుంది. లాక్ చేస్తే ఆగిపోతుంది. ఇలా వాచ్ నడిచే సమయం తగ్గించడమే మీ పని. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని రోజువారీగా ఫోన్‌వాడే సమయాన్ని తెలుసుకుంటూ తగ్గించుకుంటే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు.
తాజా వార్తలు (Latest News)
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం