WhatsApp Tip: వాట్సాప్‌లో ఒకేసారి ఎక్కువ మందికి మెసేజ్‌ ఎలా పంపాలి?

వాట్సాప్‌లో ఒకేసారి ఐదుగురి కన్నా ఎక్కువ మంది యూజర్స్‌కు వ్యక్తిగత మెసేజ్ పంపేందుక ఏం చేయాలో తెలుసుకుందాం. 

Published : 12 Dec 2021 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పర్సనల్‌ చాట్ నుంచి ప్రొఫెషనల్‌ కమ్యూనికేషన్‌ వరకు ఎన్నో విధాలుగా సమాచార బదిలీకి వాట్సాప్ యాప్‌ను వినియోగిస్తుంటాం. అయితే ఇందులోని పూర్తి ఫీచర్ల గురించి చాలా మంది యూజర్స్‌కు తెలియదనే చెప్పుకోవాలి. తరచుగా వాడే ఆడియో, వీడియో, మెసేజ్‌ ఫార్వాడ్‌ వంటి ఫీచర్లు మినహాయిస్తే ఇతర ఫీచర్లను ఉపయోగించేవారి సంఖ్య తక్కువే. అయితే వాట్సాప్‌ ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి మెసేజ్‌ పంపాలంటే ఏం చేయాలి? దీనికి  వెంటనే వినిపించే సమాధానం గ్రూప్ క్రియేట్ చేయడమే. కానీ, గ్రూపులో కాకుండా వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపాలంటే.. ఏముంది ఒక్కో కాంటాక్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది కదా అంటారు. కానీ ఒక్కో కాంటాక్ట్ సెలెక్ట్ చేసి ఒకేసారి కేవలం ఐదుగురికి మాత్రమే మెసేజ్‌లు పంపగలం. అంతకు మించి పంపాలంటే సాధ్యంకాదు. మరి వాట్సాప్‌లో ఒకేసారి ఐదుగురికి మించి వ్యక్తిగతంగా మెసేజ్‌ పంపేందుకు ఏం చేయాలో తెలుసా...?

* వాట్సాప్‌లో ఒకేసారి వ్యక్తిగతంగా 256 మందికి మెసేజ్‌ పంపొచ్చు. అందుకోసం మీరు ఈ కింది విధంగా చేస్తే సరిపోతుంది.

* ముందుగా మీరు వాట్సాప్‌లో బ్రాడ్‌కాస్ట్‌ లిస్ట్ రూపొందించాలి. వాట్సాప్‌ యాప్‌ ఓపెన్ చేసి చాట్ పేజ్‌ పైన కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

* అందులో ‘న్యూ బ్రాడ్‌కాస్ట్’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు మెసేజ్‌ పంపాలనుకుంటున్న యూజర్స్‌ను సెలెక్ట్‌ చేయాలి.

* అలా మీరు 256 మంది వరకు కాంటాక్ట్‌లను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఓకే చేస్తే మీరు ఎంపిక చేసిన కాంటాక్ట్‌ల జాబితాతో కొత్త బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌ తయారవుతుంది.

* అందులో మీరు ఎలాంటి మెసేజ్‌ షేర్ చేసినా ప్రతి ఒక్కరికీ మీరు వ్యక్తిగతంగా పంపినట్లుగా చేరుతుంది.

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని