WhatsApp: వాట్సాప్‌లో 65536 నంబర్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా?

యూజర్లకు మెరుగైన సేవలు అందించడంతో భాగంగా వాట్సాప్‌ ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువైన ఈ యాప్‌లో కొన్ని ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. అవేంటో చూద్దాం.

Published : 16 Jan 2023 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి యూజర్‌ తప్పనిసరిగా వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌ను వినియోగిస్తుంటారు. సాధారణ ఫోన్‌ కాల్‌, మెసేజింగ్‌ తర్వాత చాట్‌, మీడియా ఫైల్‌ షేరింగ్‌ అనగానే ఎక్కువ మంది ఎంపిక వాట్సాప్‌. సరదా సంభాషణల నుంచి బోర్డ్‌రూమ్‌ మీటింగ్‌ల వరకు ఎన్నో వాట్సాప్‌ ద్వారా జరిగిపోతున్నాయి. యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన వాట్సాప్‌లో 65,536 నంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? 

వాట్సాప్‌లో పంపే ప్రతి మీడియా ఫైల్‌కు పరిమితి ఉంటుంది. అంటే టెక్ట్స్‌, ఫొటో, వీడియో/ఆడియో, డాక్యుమెంట్.. ఇలా ఏది షేర్‌ చేయాలన్నా నిర్ధిష్ట సైజుకు మించి పంపలేం. అలానే వాట్సాప్‌లో 65,536 అక్షరాలకు మించి ఇతరులకు పంపడం సాధ్యంకాదు. ఒకవేళ మీరు 65,537 అక్షరాలు టైప్‌ చేసి పంపాలని ప్రయత్నిస్తే.. పాప్‌-అప్‌ స్క్రీన్‌పై మొదటి 66,536 అక్షరాలు మాత్రమే పంపబడతాయి అని కనిపిస్తుంది. 

ఇతర మీడియా ఫైల్స్‌ పరిమితులు ఇలా...

  • వాట్సాప్‌లో ఒకేసారి 30 ఫొటోల వరకు పంపొచ్చు. అంతకు మించి ఫొటోలు అటాచ్‌ చేసి పంపాలని ప్రయత్నించినా వాట్సాప్‌ స్క్రీన్‌పై పాప్‌-అప్‌ విండో ద్వారా పంపడం సాధ్యపడదని తెలియచేస్తుంది. 
  • వీడియోలు కూడా ఒకేసారి 30కు మించి పంపలేం. అయితే, ప్రతి వీడియో ఫైల్ కచ్చితంగా 16 ఎంబీ సైజుకు మించి ఉండకూడదు. వాట్సాప్‌లోని కెమెరా ఆప్షన్‌ ద్వారా రికార్డు చేసిన వీడియో సైతం 16 ఎంబీ సైజుకు మించి ఉండకూడదు. 
  • డాక్యుమెంట్స్‌ విషయానికొస్తే.. గతంలో కేవలం 100 ఎంబీ సైజు ఉన్న వాటిని వాట్సాప్‌ ద్వారా ఇతరులతో షేర్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇటీవలే వాట్సాప్‌ ఫైల్‌ సైజ్‌ను పెంచింది. దీంతో యూజర్లు 2 జీబీ సైజ్‌ ఉన్న డాక్యుమెంట్లను కూడా వాట్సాప్‌ ద్వారా పంపొచ్చు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని