WhatsApp: వాట్సాప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే మీ ఖాతా రిస్కులో పడ్డట్టే!
వాట్సాప్‌లో అవగాహనలోపంతో చేసే తప్పుల వల్ల ఖాతాలు నిషేధమయ్యే అవకాశం ఉంది. మరి ఎలాంటి తప్పులు చేస్తే వాట్సాప్ యూజర్ ఖాతాలను నిషేధిస్తుందో చూద్దాం.
ఇంటర్నెట్‌డెస్క్: ఆన్లైన్ భద్రత (Online Safety)పై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. యూజర్ ఫ్రెండ్లీ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కూడా కొత్తగా ‘సేఫ్టీ ఇన్ ఇండియా’ (Safety In India) పేరుతో రిసోర్స్ హబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఈ యాప్‌ను సుమారు 400 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతపరంగా యాప్ వినియోగాన్ని మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్ ప్రతి నెలా నకిలీ ఖాతాలను తొలగించడంతోపాటు, వేర్వేరు కారణాలతో ఖాతాలపై నిషేధం విధిస్తుంటుంది. ఇలా వాట్సాప్ నిషేధించే ఖాతాల్లో కొన్ని కంపెనీ నిబంధనలు అతిక్రమించడంవల్ల, మరికొన్ని అవగాహన లోపంతో యూజర్స్ చేసే పొరపాట్ల వల్ల జరిగేవే ఉంటున్నాయి. మరి వాట్సాప్ ఎలాంటి తప్పులు చేస్తే ఖాతాలపై నిషేధం విధిస్తుందో తెలుసుకుందాం.
1️⃣ వాట్సాప్ వినియోగదారుల్లో చాలా మంది గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్‌లో వచ్చే ఫైల్స్‌ను ఇతరులకు ఫార్వాడ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మాల్వేర్ లేదా వైరస్ ఉన్న ఫైల్స్‌ను తెలియకుండానే ఫార్వాడ్ చేసేస్తాం. దానివల్ల మీ ఫోన్లోకి మాల్వేర్ లేదా వైరస్ వచ్చి చేరే ప్రమాదం ఉంది. వాట్సాప్‌లో మాల్వేర్ ఫైల్స్‌ను ఫార్వాడ్ చేయడం నిషేధం. మీరు ఫార్వాడ్ చేసిన ఫైల్స్‌లో మాల్వేర్ ఉందనే విషయం మీకు తెలియనప్పటికీ, మీ ఖాతా ద్వారా మాల్వేర్ వ్యాప్తి చేస్తున్నారని ఇతరులు ఫిర్యాదు చేసినా, వాట్సాప్ గుర్తించినా, మీ ఖాతాపై నిషేధం విధించవచ్చు. అందుకే మీరు ఫార్వాడ్ చేసే ఫైల్స్ అనుమానాస్పదంగా ఉంటే వాటిని డిలీట్ చేయడం ఉత్తమం.
2️⃣ గుర్తింపు లేని నంబర్స్ లేదా తెలియని నంబర్స్ (Unknown Numbers)ను వాట్సాప్‌లో ఫార్వాడ్ చేయడం, గ్రూపులలో యాడ్ చేయమని కోరవద్దు. ఎందుకంటే నకిలీ సమాచారం వ్యాప్తి చేసే, గుర్తింపు లేని నంబర్లను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో మీ ఖాతాపై వాట్సాప్ నిషేధం విధించవచ్చు. అందుకే అపరిచితులు, గుర్తింపు లేని ఖాతాల నుంచి వచ్చే కస్టమర్ కేర్ నంబర్లు లేదా ముఖ్యమైన నంబర్లు అంటూ వచ్చే వాటిని ఫార్వాడ్ లేదా షేర్ చేయొద్దు.
3️⃣ నకిలీ సమాచార వ్యాప్తి కోసం ఎక్కువ మంది నకిలీ ఖాతాలను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఆఫర్ల పేరుతో యూజర్లను మోసం చేసేందుకు బిజినెస్ ఖాతాల ద్వారా ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని గుర్తించి వాట్సాప్ ఎప్పటికప్పుడు తొలగించడం లేదా నిషేధిస్తుంది. కొన్నిసార్లు స్నేహితులను, దగ్గరి వారిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో పేర్లు, ఇతరత్రా వివరాలు మార్చి ఖాతాలు క్రియేట్ చేస్తుంటాం. ఒకవేళ యూజర్స్ దానిపై ఫిర్యాదు చేస్తే నకిలీ ఖాతాతోపాటు, దానికి అనుబంధంగా ఉన్న ఫోన్ నంబర్‌తో ఎలాంటి ఖాతా తెరవకుండా వాట్సాప్ నిషేధం విధిస్తుంది.
4️⃣ వాట్సాప్‌లో అధిక సంఖ్యలో మెసేజ్‌లు (Bulk Messages) ఒకేసారి పంపడం, ఆటో-మెసేజ్ లేదా ఆటో-డయల్ చేయకూడదు. అలా చేసే వారి ఖాతాలను వాట్సాప్ మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో గుర్తించడంతోపాటు, యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా సదరు ఖాతాలపై నిషేధం విధిస్తుంది.
5️⃣ వాట్సాప్‌లో ఉండే ఫీచర్లు కాకుండా, అదనపు ఫీచర్ల కోసం కొంత మంది యూజర్స్ మోడిఫైడ్ వెర్షన్ వాట్సాప్ యాప్ (Modified Version WhatsApp App)లను వినియోగిస్తుంటారు. ఈ జాబితాలో డెల్టా వాట్సాప్, జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్ వంటివి ఉన్నాయి. వీటి ద్వారా ఖాతాలు తెరవడం, మెసేజింగ్ చేయడం, గ్రూపులు క్రియేట్ చేయడంపై వాట్సాప్ నిషేధం విధించింది. ఎందుకంటే వీటికి వాట్సాప్‌లో ఉండే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉండదు. అలానే వీటి ద్వారా యూజర్ డేటా సులువుగా హ్యాకర్స్‌కు చేరిపోతుంది.
6️⃣ వాట్సాప్‌లో ఒకే మెసేజ్ ఎక్కువ మందికి పంపాలనుకునే వాళ్లు బ్రాడ్కాస్ట్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే బ్రాడ్కాస్ట్ ఫీచర్ ద్వారా తరచుగా మెసేజ్‌లు పంపినట్లు వాట్సాప్ గుర్తించినా లేదా ఇతరులు మీ ఖాతాపై ఫిర్యాదు చేసినా సదరు ఖాతాపై వాట్సాప్ నిషేధం విధించవచ్చు. అందుకే బ్రాడ్కాస్ట్ ఫీచర్‌ను అవసరమైతే తప్ప ఎక్కువసార్లు ఉపయోగించకపోవడం ఉత్తమం.
7️⃣ ఇతరుల నుంచి మెసేజ్ వచ్చినప్పుడు, వారితో సంభాషించడం ఇష్టం లేకపోతే మెసేజ్ చేయడం ఆపమని మీరు కోరినా, కొన్నిసార్లు మెసేజ్‌లు పంపుతూనే ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీరు సదరు ఖాతాపై వాట్సాప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. తర్వాత మీరు ఫిర్యాదును పరిశీలించి వాట్సాప్ సదరు ఖాతాపై చర్యలు తీసుకుంటుంది. ఇదేవిధంగా మీరు మెసేజ్ చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని పైవిధంగా కోరినా వెంటనే మెసేజింగ్ ఆపేయండి. ఒకవేళ మీపై వాట్సాప్‌కు ఫిర్యాదు చేస్తే ఖాతా నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అపరిచిత వ్యక్తులను నుంచి వచ్చే సందేశాలను అడ్డుకునేందుకు వాట్సాప్‌లో బ్లాక్ (Block), రిపోర్ట్ (Report) వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా