SunDay Tip: సులువుగా FB వీడియో డౌన్‌లోడ్‌

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో వీడియోలను షేరింగ్ చేసుకుంటూ ఉంటాం. అలానే ఫేస్‌బుక్‌ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసేందుకు..

Updated : 04 Jul 2021 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పలు వీడియోలను షేర్‌ చేసుకుంటూ ఉంటాం. అలానే ఫేస్‌బుక్‌ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసేందుకు, వేరే గ్రూప్‌కి పంపాలనుకునే యూజర్లు కొన్ని యాప్‌లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే యాప్‌ల వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొని సైబర్‌ కేటుగాళ్ల చేతికి దొరికే అవకాశం ఉంది. చాలా సులువుగా ఎలాంటి యాప్‌ అవసరం లేకుండానే ఫేస్‌బుక్‌ వీడియోలను ఏ విధంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకుందాం...

ఆండ్రాయిడ్‌ యూజర్లు ఇలా..

* ఫేస్‌బుక్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి. ఏ వీడియోనైతే డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటున్నారో దానిని క్లిక్‌ చేయండి.

* వీడియో పైభాగంలో కుడి వైపున త్రీడాట్స్‌ను క్లిక్‌ చేసి లింక్‌ను కాపీ చేసుకోండి.

* ఓ బ్రౌజర్‌లో fbdown.net ఓపెన్‌ చేసి పెట్టుకోండి.

* అందులో ఫేస్‌బుక్‌ వీడియో అనే బాక్స్‌ ఉంటుంది. అక్కడ లింక్‌ను పేస్ట్ చేయాలి.

* ఇప్పుడు మీకు క్వాలిటీకి సంబంధించి రెండు ఆప్షన్లు వస్తాయి. మీకు ఏది కావాలో దానిమీద క్లిక్‌ చేస్తే వీడియో ప్లే అవుతుంది

* వీడియో ప్రోగ్రెస్‌ బార్‌ మీద క్లిక్‌ చేస్తే త్రీడాట్స్ కనిపిస్తాయి. దానిని క్లిక్‌ చేసి వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ వీడియో మీ ఫోన్‌లోని ఫైల్‌ మేనేజర్‌లో నిక్షిప్తమై ఉంటుంది

ఐ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్..

* ఆండ్రాయిడ్‌ యూజర్‌లానే ఐఫోన్‌లోనూ ఫేస్‌బుక్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ఏ వీడియోను డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.

* లింక్‌ను కాపీ చేసుకుని సఫారి బ్రౌజర్‌లో fbdown.netలో పేస్ట్‌ చేస్తే వీడియో ప్లే అవుతుంది.

* ప్రోగ్రెస్‌ బార్‌ మీద ట్యాప్‌ చేస్తే త్రీడాట్స్‌ కనిపిస్తాయి. వాటిని క్లిక్‌ చేసి సేవ్‌ టు ఫైల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* వీడియో డౌన్‌లోడ్‌ పూర్తయ్యాక ఫొటోస్‌ యాప్‌లో సేవ్‌ అయిపోతుంది

సూచన: అయితే ప్రైవేట్‌ వీడియోలను మాత్రం డౌన్‌లోడ్‌ చేయడం కుదరదు. పబ్లిక్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని