డైసన్‌ నుంచి తొలి వాక్యూమ్‌ క్లీనర్‌.. కంటికి కనిపించని దుమ్మునూ పట్టేస్తుంది

లేజర్ డిటెక్ట్‌ టెక్నాలజీతో సరికొత్త వాక్యూమ్‌ క్లీనర్‌ను డైసన్‌ కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఇందులోని ప్రత్యేకలేంటో చూద్దాం. 

Published : 07 Feb 2022 23:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటన్‌కు చెందిన డైసన్‌ టెక్నాలజీ సంస్థ సరికొత్త వాక్యూమ్‌ క్లీనర్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. డైసన్‌ వీ12 డిటెక్ట్ స్లిమ్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ వాక్యూమ్‌ క్లీనర్‌లో లేజర్ డిటెక్ట్‌ టెక్నాలజీ ఉంది. ఇది 10 మైక్రాన్ల దుమ్మును కూడా కనిపెట్టి శుభ్రం చేస్తుంది. ఇందులోని హైపర్‌డైమియమ్‌ మోటార్‌ 150 ఎయిర్‌వాట్ల పవర్‌ఫుల్ శక్తితో దుమ్మును లాగేస్తుందని కంపెనీ తెలిపింది.

మొత్తం ఐదు దశల వడపోతలో 99.99 శాతం దుమ్ము కణాలను శుభ్రం చేయడంతోపాటు, దుమ్మును 0.3 మైక్రాన్లను తగ్గిస్తుందని సంస్థ పేర్కొంది. ఆరోగ్యవంతమైన వాతావరణం, ఇంటిని శుభ్రం చేసుకునేందుకు పట్టణ ప్రాంతాల్లోని 70 శాతం మంది భారతీయులు వాక్యూమ్‌ క్లీనర్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారని డైసన్ తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకొస్తున్న వీ12ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతారని డైసన్ ఆశాభావం వ్యక్తం చేసింది. 

భారత్‌లో డైసన్ వీ12 డిటెక్ట్ స్లిమ్ విడుదలపై కంపెనీ స్పందిస్తూ ‘‘ఇంజనీర్లుగా రోజు వారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించటం మా బాధ్యత. ఇందుకోసం గత కొద్ది నెలలుగా మేం ఎన్నో కొత్త వాటిని తయారుచేశాం. వీ12లోని టెక్నాలజీ కంటితో చూడలేని దుమ్మును కూడా శుభ్రం చేస్తుంది’’ అని డైసన్‌ తెలిపింది. భారత మార్కెట్లో వీ12 డిటెక్ట్ స్లిమ్‌ ధర రూ.58,900గా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్ కింద రూ.55,900కే లభించనుంది. డైసన్ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని