గురూ.. ఇది ఫేస్బుక్ ‘టిక్‌టాక్’
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ షార్ట్ వీడియో ప్రియుల కోసం బార్స్ (BARS) పేరుతో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. టిక్‌టాక్ తరహా ఫీచర్స్‌తో కొత్తగా ర్యాప్ రంగంలోకి అడుపెట్టాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను డిజైన్ చేశారు....
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ షార్ట్ వీడియో ప్రియుల కోసం బార్స్ (BARS) పేరుతో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. టిక్‌టాక్ తరహా ఫీచర్స్‌తో కొత్తగా ర్యాప్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను డిజైన్ చేశారు. బార్స్‌లోని ఫీచర్స్ సాయంతో యూజర్స్ సులభంగా ర్యాప్ వీడియోలను రూపొందించి షేర్ చేసుకోవచ్చు. ఇందులోని ప్రీ-రికార్డెడ్ ఫీచర్‌తో మన సొంత పదాలకు ప్రొఫెషనల్ ర్యాప్ స్టైల్ వీడియోను రూపొందించొచ్చు. ఈ యాప్‌లో రైమింగ్ డిక్షనరీ, ఛాలెంజ్ మోడ్ ఉన్నాయి. ఇవి ర్యాపర్ వీడియో రూపొందించేప్పుడు ఫ్లో ఆగిపోకుండా అవసరమైన పదాలను సూచిస్తాయి. వీడియో రికార్డింగ్ పూర్తయిన తర్వాత దాన్ని మరింత మెరుగుపరిచేందుకు వివిధ రకాల ఆడియో/వీడియో ఫిల్టర్స్ ఉన్నాయి. వాటితో పాటు క్లీన్, ఆటో ట్యూన్, ఇమేజినరీ ఫ్రెండ్స్, ఏమ్ రేడియో వంటి టూల్స్‌తో వీడియోలోని వాయిస్‌లో మార్పులు చెయ్యొచ్చు.
ఇవేకాకుండా ఈ యాప్‌లో వందలాది బీట్స్ ఉన్నాయి. యూజర్స్ వీటిలో ఒకదాన్ని ఎంచుకుని ర్యాప్ వీడియోను సిద్ధం చేసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఫోన్ గ్యాలరీలో లేదా సోషల్ మీడియాలో షేర్ చేసుకునే సదుపాయం ఉంది. బార్స్ యాప్‌ను ఫేస్‌బుక్‌కు చెందిన న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పరిమెంటేషన్ (ఎన్పీఈ) ఆర్&డీ బృందం ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ యాప్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని రీజియన్లలో విడుదల చేస్తారని బార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో కూడా ఫేస్బుక్ ఎన్పీఈ బృందం కొలాబ్ పేరుతో మ్యూజిక్ వీడియో యాప్‌ను రూపొందించింది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత యూజర్స్ ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారించారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలతో పాటు ఫేస్బుక్ కూడా షార్ట్ వీడియోల కోసం ప్ర్యతేక ఫీచర్స్‌ను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బార్స్ ఎంత మేర యూజర్స్‌ని ఆకట్టుకుంటుందనేది వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు. -
లెక్కల్లో గూగుల్ సాయం
లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది. -
విండోస్‌లోనూ ఏఐ ఎరేజ్
గూగుల్, సామ్సంగ్ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా జనరేటివ్ ఎరేజ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. -
ఛాట్‌జీపీటీతో ఏఐ టూల్స్ జాబితా
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది. -
పెయింట్‌లోనే ఏఐ!
పదాల కూర్పుతో (ప్రాంప్ట్) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్ఇన్ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు -
అంధులకు దారిచూపు
కొత్త భవనాల్లోకి వెళ్తే కళ్లు కనిపించినా తికమక పడతాం. ఇక చూపు కోల్పోయినవారైతే? ఇలాంటివారికి తోడ్పడే రెండు ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్ యాప్‌లను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు -
మెసేజెస్ నుంచే ఫొటో షేర్
ఫోన్లో ఎవరికైనా ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్తాం. వాటిని గుర్తించాక కాంటాక్టులను వెతికి షేర్ చేస్తుంటాం. ఐఫోన్ వాడేవారైతే మరింత త్వరగా మెసేజెస్ ద్వారానే దీన్ని కానియ్యొచ్చు -
యాప్ మాటలు వింటోందా?
ఫోన్లో ఏదో మాట్లాడతాం. అనంతరం ఏదో వెబ్సైట్ చూస్తుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఫోన్లో మాట్లాడే మాటలు యాప్‌లు వింటున్నాయనే అనుమానం వస్తుంటుంది. -
గూగుల్ కొత్త ఏఐ టూల్స్
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏఐ వేదికలు టెక్నాలజీ రంగాన్ని విస్తృతం చేస్తున్నాయి. గూగుల్ తమ ఏఐ వేదిక బార్డ్ పేరును ‘జెమినీ’గా మార్చింది. అంతేకాదు.. ఇటీవల ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్, మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్, టెక్స్ట్ఎఫ్ఎక్స్ అనే కొత్త ఫీచర్లనూ జోడించింది.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య