FBలో కొత్త ఫీచర్స్..లైక్ బటన్ ఉండదు..!
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ యూజర్స్‌కి సరికొత్త అనుభూతిని అందించేదుకు సిద్ధమయింది. ఈ మేరకు ఫేస్బుక్ పేజ్ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాదే ఈ ఫీచర్స్‌ని ఫేస్బుక్లో...
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ యూజర్లకి సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఫేస్బుక్ పేజ్ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్లని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాదే ఈ ఫీచర్స్‌ని ఫేస్బుక్లో పాపులర్ అయిన వ్యక్తులు, నటీనటులు, రచయితలు, క్రియేటర్స్‌తో పాటు పలు వాణిజ్య పేజీల ద్వారా పరీక్షించారు. త్వరలో ఈ మార్పులు యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి అవేంటో ఒక్కసారి చూద్దాం..
ఇంటర్ఫేస్ రీడిజైన్
ఫేస్బుక్లో పర్సనల్ ప్రొఫైల్, పబ్లిక్ పేజ్‌కి మధ్య అనుసంధానం మరింత సులభంగా ఉండేలా మార్పులు చేయనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఇందుకోసం ప్రొఫైల్, పబ్లిక్ పేజ్ ఇంటర్ ఫేస్‌ను రీడిజైన్ చేస్తున్నారు. దాని వల్ల యూజర్స్ ప్రొఫైల్, పేజ్ పోస్టులను సులభంగా మారొచ్చు.
పేజ్‌లకు మరిన్ని హంగులు
ఇక మీదట ఫేస్బుక్ పేజ్ నడిపేవాళ్లు ఫాలోవర్స్‌తో సంభాషిస్తూ వారి మధ్య జరిగే చర్చలో పాల్గొనొచ్చు. అంతేకాకుండా పేజ్‌లో పోస్టుల గురించి సెలబ్రిటీలు, వెరిఫైడ్ అకౌంట్ కలిగిన వ్యక్తులు, గ్రూపులు, ఇతర వెరిఫైడ్ పేజ్‌లు కామెంట్ చేస్తే..వాళ్లని కామెంట్ సెక్షన్ నుంచి ఫాలో అయ్యేలా అక్కడ ఫాలో ఆప్షన్ చూపిస్తుంది. అలాగే పేజ్‌లో జరిగే సంభాషణలు ఎక్కువ మందికి తెలిసేలా ఉండేందుకు సెలబ్రిటీలు, వెరిఫైడ్ అకౌంట్ కలిగిన వ్యక్తులు, గ్రూపులు, ఇతర వెరిఫైడ్ పేజ్‌ల నుంచి వచ్చిన కామెంట్స్ మొదట కనిపిస్తాయి. దాంతో వారిని సులభంగా గుర్తించి రిప్లై ఇవ్వొచ్చు, ఫాలో కావొచ్చు.
లైక్ బటన్ కనిపించదు
ఫేస్బుక్లో మనకు ఏదైనా పేజ్ నచ్చితే దాన్ని లైక్ కొట్టి ఫాలో అవుతాం. ఇక మీదట ఇలా చేయడం కుదరదు. ఎందుకంటే పేజ్ లైక్ బటన్‌ను తొలగిస్తున్నారు. దానికి బదులు ఫాలో బటన్ ద్వారానే పేజ్‌కు సంబంధిన అప్డేట్స్ను పొందొచ్చు. ఫాలోవర్స్ ఆధారంగానే ఆ పేజ్ నడిపేవాళ్లకు ఫేస్బుక్లో ఎంత మంది అభిమానులున్నారు..పేజ్ ఎంత పాపులర్ అనేది నిర్ధారిస్తారు. ఉదాహరణకు కొంతమంది ముందుగా పేజ్‌ను లైక్, ఫాలో చేసి తర్వాత ఆసక్తి లేక అన్‌ఫాలో చేస్తారు. కానీ డిస్లైక్ చెయ్యరు. దాంతో పేజ్ పాపులారిటీని నిర్ధారించేప్పుడు లైక్స్, ఫాలోవర్స్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఈ తరహా పద్ధతికి చెక్ పెట్టేందుకు పేజ్ లైక్ బటన్ని తీసేస్తున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.
పేజ్ మేనేజ్మెంట్
ఇక పేజ్ మేనేజ్మెంట్ యాక్సెస్‌లో కూడా కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నారు. పేజ్‌లో ఇన్సైట్స్, యాడ్స్, కంటెట్, కమ్యూనిటీ యాక్టివిటీ, మెస్సేజెస్ వంటి వాటికి సంబంధించిన పనులను చక్కబెట్టేందుకు అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేలా మార్పులు చేస్తున్నారు. దీని వల్ల పేజ్ భద్రత, నైతికతకు భంగం వాటిల్లదని ఫేస్బుక్ భావిస్తోంది. గతంలో ఇలాంటి వాటి కోసం పూర్తిగా పేజ్ అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేవారు. ఫేస్‌బుక్‌కు వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. వీటితో పేజ్‌లకు కొత్త అడ్మిన్లను యాడ్ చేయడం, ఇన్సైట్స్ అనుమతులు ఇవ్వడం మరింత సులభం అవుతుంది.
వెరిఫైడ్ బ్యాడ్జ్‌కి కొత్త హంగులు
నకిలీ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగాలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే వారిపట్ల ఫేస్బుక్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇందుకోసం వెరిఫైడ్ పేజ్‌లకు ఇచ్చే బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యాడ్జ్ బాగా కనిపించేలా మార్పులు చేయనున్నారు. దాని వల్ల వైరిఫైడ్ ఖాతాల నుంచి వచ్చే అభ్యంతరకర పోస్టులు, కామెంట్లను వ్యాపించకుండా అడ్డుకోవచ్చని ఫేస్బుక్ అభిప్రాయపడుతోంది. ఇవే కాకుండా ప్రశ్న, జవాబు తరహా ఫీచర్‌ని కూడా తీసుకొస్తున్నారు. దీని ద్వారా పేజ్ క్రియేటర్స్.. ఫాలోవర్స్ నుంచి నేరుగా ప్రశ్నలు స్వీకరించవచ్చు. వాణిజ్య అవసరాల కోసం పేజ్ నడిపే వ్యక్తుల లేదా కంపెనీలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని ఫేస్బుక్ పేర్కొంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు. -
లెక్కల్లో గూగుల్ సాయం
లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది. -
విండోస్‌లోనూ ఏఐ ఎరేజ్
గూగుల్, సామ్సంగ్ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా జనరేటివ్ ఎరేజ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. -
ఛాట్‌జీపీటీతో ఏఐ టూల్స్ జాబితా
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది. -
పెయింట్‌లోనే ఏఐ!
పదాల కూర్పుతో (ప్రాంప్ట్) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్ఇన్ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు -
అంధులకు దారిచూపు
కొత్త భవనాల్లోకి వెళ్తే కళ్లు కనిపించినా తికమక పడతాం. ఇక చూపు కోల్పోయినవారైతే? ఇలాంటివారికి తోడ్పడే రెండు ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్ యాప్‌లను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు -
మెసేజెస్ నుంచే ఫొటో షేర్
ఫోన్లో ఎవరికైనా ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్తాం. వాటిని గుర్తించాక కాంటాక్టులను వెతికి షేర్ చేస్తుంటాం. ఐఫోన్ వాడేవారైతే మరింత త్వరగా మెసేజెస్ ద్వారానే దీన్ని కానియ్యొచ్చు -
యాప్ మాటలు వింటోందా?
ఫోన్లో ఏదో మాట్లాడతాం. అనంతరం ఏదో వెబ్సైట్ చూస్తుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఫోన్లో మాట్లాడే మాటలు యాప్‌లు వింటున్నాయనే అనుమానం వస్తుంటుంది. -
గూగుల్ కొత్త ఏఐ టూల్స్
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏఐ వేదికలు టెక్నాలజీ రంగాన్ని విస్తృతం చేస్తున్నాయి. గూగుల్ తమ ఏఐ వేదిక బార్డ్ పేరును ‘జెమినీ’గా మార్చింది. అంతేకాదు.. ఇటీవల ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్, మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్, టెక్స్ట్ఎఫ్ఎక్స్ అనే కొత్త ఫీచర్లనూ జోడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!