Facebook: ఫేసుబుక్‌లో ఇక ఈ రెండు ఫీచర్లు ఉండవు!

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫారమ్‌లోని ‘నియర్‌ బై ఫ్రెండ్స్‌’, ‘వెథర్‌ అలర్ట్‌’ అనే రెండు ఫీచర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.

Updated : 09 May 2022 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫామ్‌లోని ‘నియర్‌ బై ఫ్రెండ్స్‌’, ‘వెథర్‌ అలర్ట్‌’ అనే రెండు ఫీచర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. మే 31 వరకే వీటి సేవలు అందుబాటులో ఉంటాయని, ఆ తర్వాత వీటి వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే, దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

దీని సంబంధించి ఫేస్‌బుక్‌ యాప్‌ ద్వారా ఇప్పటికే యూజర్లకు నోటిఫికేషన్స్‌ పంపడం ప్రారంభించింది. ‘‘నియర్‌ బై ఫ్రెండ్స్‌, వెథర్‌ అలర్ట్‌ ఫీచర్ల సేవలు మే 31 తర్వాత అందుబాటులో ఉండవు. వీటితో లోకేషన్‌ హిస్టరీ, బ్యాక్‌గ్రౌండ్‌ లోకేషన్‌ వంటి సేవలు కూడా నిలిచిపోతాయి. ఈ నెలాఖరుకు ఇప్పటివరకు ఇందులో సేవ్‌ అయిన డేటా డిలీట్‌ అవుతుంది’’ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

‘నియర్‌ బై ఫ్రెండ్స్‌’ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ 2014లో ప్రారంభించింది. మొదట్లో యూజర్లకు ప్రైవసీ సమస్యలు తలెత్తాయి. అయినా చాలా ఏళ్లపాటు ఫేస్‌బుక్‌ యాప్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా తొలగించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని