​​​​​​ఈ అమెజాన్‌ లింక్‌ మీకూ వచ్చిందా?

ఆ కంపెనీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి ఉచితంగా షూ ఇస్తోంది.. ఈ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత గిఫ్ట్‌ అందిస్తోందంటూ వాట్సాప్‌ల.....

Updated : 26 Mar 2021 20:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆ కంపెనీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి ఉచితంగా షూ ఇస్తోంది.. ఈ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత గిఫ్ట్‌ అందిస్తోందంటూ వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు మెసేజులు వస్తుంటాయి. అలాంటివి రాగానే అందులో నిజమెంతో తెలుసుకోకుండా ఇతరులకు పంపించేస్తుంటారు కొందరు. ఫ్రీ గిఫ్ట్‌ అటుంచితే అలాంటి లింకులు క్లిక్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల బారిన పడడం మాత్రం ఖాయం. తాజాగా అమెజాన్‌ పేరిట కూడా ఓ లింక్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో తెగ సర్క్యులేట్‌ అవుతోంది. బహుశా ఈ పాటికే మీకూ వచ్చి ఉంటుంది. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది.

ముందుగా ఈ లింకును గనుక పరిశీలిస్తే.. అమెజాన్‌ లోగోతోనే వస్తుండడం ఎక్కువమంది నమ్మేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. కానీ నిశితంగా పరిశీలిస్తే అమెజాన్‌ స్పెల్లింగ్‌ తప్పు ఉంటోంది. అలాగే యూఆర్‌ఎల్‌ కూడా HTTPతో ప్రారంభమవుతోంది. ‘S’ లేదంటే అది సెక్యూర్‌ కాదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లింకులు హెచ్‌టీటీపీతోనే ప్రారంభమవుతుంటాయన్నది గమనించాలి. ఇక లింక్‌ క్లిక్‌ చేస్తే ఫలానా ఫోన్‌ గెలుచుకోవాలంటే ఈ సందేశాన్ని వాట్సాప్‌ గ్రూపుల్లోనూ, వ్యక్తులకు పంపించాలని వస్తుంది. వాస్తవానికి అమెజాన్‌ ఎలాంటి ఆఫరూ ప్రకటించలేదు. అంతపెద్ద కంపెనీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు తన వెబ్‌సైట్‌లో పొందుపరచకుండా ఉంటుందా? కాబట్టి ఇలాంటి ఫేక్‌ మెసేజులు నమ్మొద్దు. మోసపూరిత లింకులను క్లిక్‌ చేసి సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దు. భవిష్యత్‌లో ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు కూడా అప్రమత్తంగా వ్యవహరించండి. మీతో పాటు మీతోటి వారు కూడా సైబర్‌ నేరస్థుల బారిన పడకుండా చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని