Facebook Messenger: త్వరలో ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో మార్పులు.. అవేంటంటే?

మెసేజ్‌ చాట్‌ని స్క్రీన్‌షాట్స్‌ తీసుకొని కొందరు ఆకతాయిలు బెదిరిస్తూ ఉంటారు. ఇలా పలు ఫిర్యాదుల గురించి వింటూనే ఉంటాం. మరి.. దీన్ని నుంచి యూజర్లకు రక్షణ కల్పించేందుకు ముందుకొచ్చింది ప్రముఖ సోషల్‌ నెట్‌వర్క్‌ ఫేస్‌బుక్‌.

Published : 31 Jan 2022 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజ్‌ చాట్‌ని స్క్రీన్‌షాట్స్‌ తీసుకొని కొందరు ఆకతాయిలు బెదిరిస్తూ ఉంటారు. ఇలా పలు ఫిర్యాదుల గురించి వింటూనే ఉంటాం. మరి.. దీని నుంచి యూజర్లకు రక్షణ కల్పించేందుకు ముందుకొచ్చింది ప్రముఖ సోషల్‌ నెట్‌వర్క్‌ ఫేస్‌బుక్‌. ఇకపై ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఎవరైనా మీరు చేసిన చాట్‌ని స్క్రీన్‌షాట్స్‌ తీయాలని ప్రయత్నించినా వెంటనే అలర్ట్‌ చేస్తుందట. యూజర్‌ లేదా అవతల వ్యక్తి చాట్‌ని స్ర్కీన్‌షాట్స్‌ తీసేందుకు ప్రయత్నం చేసినా వెంటనే గుర్తించేలా యూజర్లకు నోటిఫికేషన్‌ను పంపనుంది. గతంలో ‘వానిష్‌ మోడ్‌’లో ఉన్నప్పుడే ఈ అలర్ట్‌ సిస్టమ్‌ పనిచేసేది ఇప్పుడు అన్ని చాట్స్‌కీ వర్తించేలా కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టనుంది. ‘‘ యూజర్ల భద్రతకు రక్షణ కలిగించడంతో పాటు. డిస్‌అప్పీయర్‌ మెసేజెస్‌ని సైతం స్క్రీన్‌షాట్‌ తీసుకున్నా మీ దృష్టికి తీసుకురావాలనేదే మా ప్రధాన ఉద్దేశం’’ అని మేటా ప్రకటనలో పేర్కొంది.

కొత్తగా ఫార్వార్డ్‌ ఆప్షన్‌

వాట్సాప్‌, ఇన్‌స్టాలో లాంగ్‌ ప్రెస్‌చేస్తే మెసేజ్‌  ఫార్వాడ్‌ అయ్యే ఆప్షన్‌ను ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లోనూ తీసుకొచ్చినట్టు మెటా తెలిపింది.

* ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌డెట్‌ చాట్స్‌కి వెరిఫైడ్‌ బ్యాడ్జిని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా అథెన్టిక్‌ అకౌంట్స్‌తో సురక్షితంగా సంభాషించే వెసులుబాటు ఉంటుంది.

* అంతే కాదు.. ఇతరుల నుంచి మనకొచ్చిన ఫొటోలు, వీడియోలను సైతం లాంగ్‌ ప్రెస్‌ చేసుకొని సేవ్‌ చేసుకోవచ్చు. గ్యాలరీ నుంచి ఫొటోస్‌, వీడియోస్ పంపేటప్పుడు యూజర్లు ముందుగా వాటిని ఎడిట్‌ చేసుకోవచ్చు. నచ్చిన స్టికర్స్‌, స్ర్కిబ్లింగ్‌తో పాటు ఏదైనా టెక్ట్స్‌ క్రాపింగ్‌ చేయొచ్చు, వీడియోస్‌కి ఆడియో ఎడిటింగ్‌ కూడా చేసుకోనే ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని