Insta Tips: గంటా.. రెండు గంటలా..! ఇన్‌స్టాలో మీరు గడిపేదెంత..?

ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు రోజు ఎంత సమయం గడుపుతున్నారు..? ఎప్పుడైనా దీనికి గురించి ఆలోచించారా.. 

Updated : 15 Feb 2022 19:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ట్రెండంతా ‘ఇన్‌స్టాగ్రామ్’దే. మరి ఇన్‌స్టాలో మీరు రోజు ఎంతసేపు గడుపుతున్నారు..? గంటా.. రెండు గంటలా.. లేదా అంతకుమించా..?ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా..! అయితే, ఇన్‌స్టాలో రోజు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఇలా తెలుసుకోండి..

* తొలుత ఇన్‌స్టా ఖాతాలో మీ ప్రొఫైల్‌లో ఓపెన్‌ చేయండి.

తర్వాత పైనే ఉన్న మెనూ బార్‌ ఓపెన్‌ చేసి.. యాక్టివిటీ (Your activity) ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

అంతే మీరు రోజు వారీగా మొత్తం వారంలో ఇన్‌స్టాగ్రామ్‌ను ఎంతసేపు వినియోగించారో వివరాలు తెలుసుకోవచ్చు. 

మరోవైపు కిందనే ఉన్న ‘సెట్ డైలీ రిమైండర్‌ (set daily reminder)’ ఫీచర్‌ను ఉపయోగించి రోజు ఇన్‌స్టాను ఎంతసేపు వాడాలనుకుంటున్నారో టైమ్‌ను సెట్‌ చేసుకోవచ్చు. తద్వారా మీరు కేటాయించిన సమయం ముగియగానే యూజర్లను ఇన్‌స్టా అప్రమత్తం చేస్తుంది. 

సరికొత్త ఫీచర్ ‘టేక్‌ ఏ బ్రేక్’

ఇదిలాఉంటే ఇన్‌స్టా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. యువత ఎక్కువ సమయం ఇన్‌స్టాలో గడపకుండా ఉండేందుకు ‘టేక్‌ ఏ బ్రేక్’ (Take A Break)పేరుతో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ మేరకు వినియోగదారులు ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తున్నట్లయితే ఫోన్‌ స్క్రీన్‌పైన టేక్‌ ఏ బ్రేక్‌ అంటూ పాప్‌-అప్‌ మెసేజ్‌ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎంత సమయం బ్రేక్ తీసుకోవాలనే దానికి సంబంధించి టైమ్‌ పరిమితులు కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని