Fire Boltt: బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో ఫైర్‌బోల్ట్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌

ఫైర్‌బోల్ట్‌ కంపెనీ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ వాచ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

Updated : 12 Aug 2022 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ నోటిఫికేషన్ల నుంచి ఆరోగ్య సమాచారం వరకూ ముఖ్యమైన ఫీచర్లు ఉండటంతో స్మార్ట్‌వాచ్‌ (Smartwatch)లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. ఇటీవలి కాలంలో బ్లూటూత్‌ కాలింగ్‌ (Bluetooth Calling) ఫీచర్‌ ఉన్న స్మార్ట్‌వాచ్‌లవైపు ఎక్కువ మంది యూజర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్‌బోల్ట్‌ (Fire Boltt) కంపెనీ కొత్తగా ఈ ఫీచర్‌తో మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫైర్‌బోల్ట్‌ విజనరీ (Fire Boltt) పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌వాచ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

ఫైర్‌బోల్ట్‌ విజనరీ ఫీచర్లు

ఫైర్‌బోల్ట్‌ విజనరీ వాచ్‌లో 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో 100 స్పోర్ట్‌ మోడ్స్‌ ఉన్నాయి. యూజర్లు తమకు నచ్చిన గేమ్‌ మోడ్‌ను ఎంచుకుని గోల్స్‌ పెట్టుకుని ఫిట్‌నెస్‌ టాస్క్‌ పూర్తి చేయొచ్చు. ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారాన్ని యూజర్‌కు తెలిపేందుకు ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్‌రేట్ ట్రాకింగ్‌, స్లీప్‌ మానిటరింగ్‌, స్టెప్‌ కౌంట్‌, ఫిట్‌నెస్‌‌, బీపీ, మెన్‌స్ట్రువల్‌ ట్రాకింగ్‌తోపాటు హైడ్రేషన్‌ రిమైండర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌‌. యూజర్‌ కాలింగ్‌ కోసం ప్రతిసారీ ఫోన్‌ ఉపయోగించకుండా డయల్‌ పాడ్‌‌, కాల్‌ హిస్టరీ, కాల్‌ డేటా సింక్‌, కాంటాక్ట్స్‌ను సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు. వాయిస్‌ అసిస్టెంట్‌ను సపోర్ట్‌ చేస్తుంది. వాయిస్‌ కమాండ్స్‌తో కాలింగ్, మ్యూజిక్ కంట్రోల్‌ చేయొచ్చు.

ఇవేకాకుండా ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్, గేమ్స్, వెదర్‌ అప్‌డేట్స్‌, స్ల్పిట్‌ స్క్రీన్‌, అలారమ్‌ క్లాక్‌, టైమర్‌, టీడబ్ల్యూఎస్‌ పెయిరింగ్ ఫీచర్లు ఇస్తున్నారు. ఈ స్మార్ట్‌వాచ్‌ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏడు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఫైర్‌బోల్ట్‌ విజనరీ ధర ₹ 3,799. అమెజాన్‌, ఫైర్‌బోల్ట్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. బ్లూ, బ్లాక్‌, పింక్‌, గ్రీన్‌, సిల్వర్‌, గ్రే రంగుల్లో లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని