iPhone: పాత ఐఫోన్‌కు 50 రెట్లు అధిక ధర.. ఎందుకంత ప్రత్యేకం!

యాపిల్ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్‌ ధర ఎక్కువ అని పలువురు యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ధర కంటే 50 రెట్లు అధిక ధరకు పాత ఐఫోన్ అమ్ముడుకానుంది. పాత ఫోన్‌కు ఎందుకంత ధర? ఆ వివరాలేంటో చూద్దాం.

Published : 17 Oct 2022 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు ఎన్ని విడుదలైనా.. పాత తరం వాటికి ఉండే క్రేజ్‌ వేరు. అందుకే వేలం పాటలో కొత్త వాటి కంటే పాత వస్తువులు ఎక్కువ ధర పలుకుతుంటాయి.  ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు కాగా,  హైఎండ్ వేరియంట్‌ ధర1,699 డాలర్లుగా ఉంది.  ఈ ధరను యాపిల్‌ కంపెనీ  ఫస్ట్ జనరేషన్‌ ఐఫోన్ దాటేయనుంది. అసలు ధర కంటే 50 రెట్లు అధిక ధరకు అమ్ముడుకానుందట.  పాత ఫోన్‌కు ఎందుకంత ధర? ఆ ఫోన్‌లో ప్రత్యేకత ఏంటో చూద్దాం. 

అమెరికాకు చెందిన ఎల్‌సీజీ ఆక్షన్స్ అనే సంస్థ అక్టోబరు 23న యాపిల్ కంపెనీ ఫస్ట్‌ జనరేషన్‌ ఐఫోన్‌ను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. యాపిల్ కంపెనీ 2007లో తయారుచేసిన ఈ ఫోన్‌ బాక్స్‌ను ఇంతవరకూ తెరవలేదు. అదే ఈ ఫోన్ ప్రత్యేకత అని ఎల్‌సీజీ చెబుతోంది. అప్పట్లో ఈ ఫోన్ ధర 599 డాలర్లు. 8జీబీ స్టోరేజ్‌, 3.5 అంగుళాల స్క్రీన్‌, 2 ఎంపీ కెమెరా, వెబ్‌ బ్రౌజింగ్ ఫీచర్లు ఉన్నాయి. అప్పట్లో, ఫోన్ విడుదల సందర్భంగా యాపిల్ మాజీ సీఈవో స్టీవ్‌ జాబ్స్‌ మాట్లాడుతూ ఐపాడ్‌, ఫోన్‌, ఇంటర్నెట్‌ కమ్యూనికేటర్‌ కలయిగా ఐఫోన్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పారని ఎల్‌సీజీ తెలిపింది. ఈ ఫోన్‌ వేలం ధర 2,500గా ఎల్‌సీజీ నిర్ణయించింది.  ఇప్పటి వరకు వేలంలో పాల్గొనేందుకు 16 మంది బిడ్‌ వేసినట్లు తెలిపింది. వీటిలో అధికంగా 10,446 డాలర్లకు బిడ్‌ వేశారట. ఆదివారం నిర్వహించబోయే వేలంలో ఈ ఫోన్ 30,000 డాలర్ల వరకు ధర పలుకుతుందని ఎల్‌సీజీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts