iPhone 13 Series: ఐఫోన్‌ 13 సిరీస్‌పై ఆఫర్‌.. ₹15వేలు తగ్గింపు!

ఐఫోన్ 13 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్‌ మరో గొప్ప డీల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ ద్వారా యూజర్స్ ఐఫోన్ 13 సిరీస్‌ మోడల్‌ను సుమారు రూ. 15 వేల తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చని తెలిపింది. 

Published : 01 Feb 2022 01:44 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్ ప్రియుల కోసం ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో గొప్ప డీల్‌ను ప్రకటించింది. ఐఫోన్ 13 సిరీస్‌ మోడల్స్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ కింద ఐఫోన్‌ 13  సిరీస్‌ మోడల్స్‌ కొనుగోలు చేయాలనుకునే యూజర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌ చేసి సుమారు రూ. 15,850 వరకు డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఉదాహరణకు ఐఫోన్‌ 13 మినీ 128జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. 69,900 కాగా, ఫ్లిప్‌కార్ట్‌ 4 శాతం డిస్కౌంట్‌ అందిస్తుంది. దీంతో అసలు ధరపై రూ. 3 వేలు తగ్గింపుతో ఐఫోన్ 13 మినీ రూ. 66,900కు లభిస్తుంది.

సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. అలానే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇవి కాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా రూ. 15,850 డిస్కౌంట్‌ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ చేయాలనుకునే యూజర్లు ముందుగా తమ ఏరియా పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేసి ఆ ప్రాంతంలో ఎక్స్ఛేంజ్‌ ఆఫర్ అందుబాటులో ఉందో.. లేదో చెక్ చేసుకోవాలి. ఈ ఆఫర్‌ 256 జీబీ, 512 జీబీ వేరియంట్‌లకు కూడా అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 

ఐఫోన్ 13

ఐఫోన్ 13 మోడల్‌ 128 జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. 79,990 కాగా, దీనిపై ఫ్లిప్‌కార్ట్ 6 శాతం డిస్కౌంట్‌ అందిస్తుంది. దీంతో ఈ ఫోన్ రూ. 74,900కు లభిస్తుంది. దీంతోపాటు ఐఫోన్ 13పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్ కింద సుమారు రూ. 18,850 డిస్కౌంట్ అందిస్తుంది. సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ ఉపయోగించి కొనుగోలు చేసిన యూజర్లకు 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. అలానే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. దీంతో యూజర్‌ సుమారు. రూ. 18 వేలు తగ్గింపు ధరతో ఐఫోన్‌ 13ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ మోడల్స్‌ కూడా వర్తిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ 13 ప్రో 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 1,19,999 కాగా, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 1,29,900. 

ఐఫోన్ 13 ఫీచర్లు

ఐఫోన్‌ 13లో 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. ప్రధాన కెమెరా 12 మెగాపిక్సల్స్‌ (ఎంపీ) కాగా వీడియోల కోసం సినిమాటిక్ మోడ్ ఫీచర్‌ అందిస్తున్నారు. ఐఫోన్ 12 మోడల్స్‌లో కంటే ఐఫోన్ 13లో అధిక స్టోరేజ్‌ సామర్థ్యం ఇస్తున్నారు. లేటెస్ట్‌ ఏ15 బయానిక్‌ చిప్‌, ఐఓఎస్‌ 15తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ, 3,227 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ, 20W ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని