
WhatsApp: వాట్సాప్‌లో చాట్ డిలీట్ చేశారా.. ఇలా రికవరీ చేయండి
ఇంటర్నెట్‌డెస్క్: తప్పులు చేయడం మానవ సహజం. అందుకే తప్పు చేసిన వారికి దాన్ని సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇస్తుంటారు. అన్ని సార్లు అది సాధ్యం కాకపోవచ్చు. కానీ, వాట్సాప్‌లో మీరు ఎన్నిసార్లు తప్పుచేసినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి పంపితే, దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌తో తొలగించవచ్చు. అలానే పొరపాటున మీరు డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందవచ్చు. అదెలాగో చూద్దాం. వాట్సాప్‌లో రెండు రకాల బ్యాకప్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఒకటి ఫోన్ మెమొరీ కాగా, రెండోది క్లౌడ్. ఒకవేళ మీరు ఫోన్ పోగొట్టుకున్నా చాట్ డేటా గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. అక్కడి నుంచి మీరు ఎప్పుడైనా చాట్‌ని తిరిగి పొందొచ్చు.
క్లౌడ్ స్టోరేజ్ నుంచి
పొరపాటున మీరు వాట్సాప్ నుంచి చాట్ డిలీట్ చేస్తే.. వెంటనే వాట్సాప్ నుంచి బయటికి వచ్చి యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయండి. తర్వాత యాప్‌ను తిరిగి రీ-ఇన్స్టాల్ చేయండి. మీ వివరాలు నమోదు చేసిన తర్వాత చాట్ బ్యాకప్‌ను రీస్టోర్ చేయంటారా? అని అడుగుతుంది. అప్పుడు మీరు రీస్టోర్పై క్లిక్ చేస్తే మీరు డిలీట్ చేసిన చాట్ ఫోన్లో మీకు కనిపిస్తుంది. ఈ పద్ధతి ద్వారా చాట్ రికవరీ చేయాలంటే మాత్రం మీ ఫోన్లో చాట్ బ్యాకప్ ఎనేబుల్ చేసుండాలి. ఒకవేళ మీ ఫోన్లో చాట్ బ్యాకప్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే మాత్రం మీరు డిలీట్ చేసిన చాట్‌ని తిరిగి పొందటం సాధ్యంకాదు.
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఇలా చేయొచ్చు!
అలానే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తుంటే చాట్స్‌ను రికవరీ చేయడం సులభం. ఇందుకోసం యూజర్స్ తమ ఫోన్లలో ఫైల్ మేనేజర్ యాప్‌లో ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేయాలి. అందులో ఆండ్రాయిడ్ ఫోల్డర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీడియా ఫైల్‌పై క్లిక్ చేస్తే కామ్. వాట్సాప్ అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో డేటాబేస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే msgstore-YYY-MM-DD.1.db.crypt14 నుంచి msgstore.db.crypt14గా మార్చాలి. తర్వాత వాట్సాప్ యాప్‌ని అన్-ఇన్స్టాల్ చేసి తిరిగి ఇన్స్టాల్ చేయాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.