యాపిల్‌ యూజర్లకు..

వాట్సాప్‌ వాడకం మొదలైన కొత్తలో ‘బ్లూ టిక్స్‌’ గురించి విన్నాం. అవసరమైతే ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసి వాట్సాప్‌ని వాడుతున్నాం....

Published : 17 Mar 2021 00:48 IST

వాట్సాప్‌ వాడకం మొదలైన కొత్తలో ‘బ్లూ టిక్స్‌’ గురించి విన్నాం. అవసరమైతే ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసి వాట్సాప్‌ని వాడుతున్నాం. ఆయా సందేశాలను మీరు చదివినట్టు పంపినవారికి తెలిసేలా చేసేవే ఈ బ్లూ టిక్స్‌. ఒకవేళ వీటిని Read Receipt తో డిసేబుల్‌ చేస్తే బ్లూటిక్స్‌ కనిపించవు. ఇది ఇప్పటి వరకూ కేవలం మెసేజ్‌ల వరకే పరిమితం అయ్యింది. కానీ, ఎవరైనా వాయిస్‌ మెసేజ్‌లు పంపితే వాటికి అప్లై అవ్వదు. మీరు విన్నారనే విషయం బ్లూ టిక్స్‌తో వారికి తెలిసిపోతుంది. ఇప్పుడు యాపిల్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కొత్త అప్‌డేట్‌తో వాయిస్‌ మెసేజ్‌లకు కూడా బ్లూటిక్స్‌ కనిపించవు. దీంతో మీరు వాయిస్‌ క్లిప్‌ని విన్నారనే విషయం వారికి తెలియదన్నమాట. ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసేందుకు యాపిల్‌ యూజర్లు వాట్సాప్‌లోని Settings > Account > Privacy విభాగంలోకి వెళ్లండి. అంతేకాదు.. ఐఓఎస్‌ వాట్సాప్‌ యూజర్లకు కొత్త అనుభవాన్ని ఇచ్చేలా ‘థర్డ్‌పార్టీ యానిమేటెడ్‌ స్టిక్కర్స్‌ ప్యాక్స్‌’ని ఇంపోర్ట్‌ చేసుకునేందుకు వీలు కల్పించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు