‘సిగ్నల్‌’ మారిపోద్ది

ఇప్పటి వరకూ ఎన్నో రకాల సరికొత్త ఫీచర్లను పరిచయం చేసిన సిగ్నల్‌.. ఒక్క ఆప్షన్‌ విషయంలోనే ఆలస్యం చేసింది...

Updated : 21 Dec 2022 16:23 IST

ప్పటి వరకూ ఎన్నో రకాల సరికొత్త ఫీచర్లను పరిచయం చేసిన సిగ్నల్‌.. ఒక్క ఆప్షన్‌ విషయంలోనే ఆలస్యం చేసింది. అదే, ‘డేటా ట్రాన్స్‌ఫర్‌’. అంటే.. ఒక ఫోన్‌లోని సిగ్నల్‌ డేటాని మరో కొత్త దాంట్లోకి రీస్టోర్‌ చేసుకోవడం. ఇప్పటి వరకూ డేటాని మాన్యువల్‌గా బ్యాక్‌అప్‌, కాపీ చేసుకోవడం ఒక్కటే ఆప్షన్‌. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. వాట్సాప్‌లో మాదిరిగానే కొత్త ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి ఫోన్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ అయితే చాలు. ఆటోమేటిక్‌గా సిగ్నల్‌ డేటా రీస్టోర్‌ అయిపోతుంది. ‘ట్సాన్స్‌ఫర్‌ అకౌంట్‌’ పేరుతో ఆప్షన్‌ని పరిచయం చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బీటా వెర్షన్‌ అప్‌డేట్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రెండు, మూడు వారాల్లో యూజర్లకు ఆప్షన్‌ని పరిచయం చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని