ఆడియో వినేటప్పుడు..

టెక్స్ట్‌ మెసేజ్‌లతో పాటు కొన్ని సార్లు ఆడియో మెసేజ్‌లు కూడా వాట్సాప్‌లో వింటుంటాం. ఇలా ఎక్కువ నిడివితో కూడిన వాయిస్‌ మెసేజ్‌లను వినే క్రమంలో ‘ప్లేబ్యాక్‌ స్పీడ్‌’ని పెంచుకోవచ్చు తెలుసా? అందుకు తగిన ఫీచర్‌ని ప్రయోగాత్మకంగా ....

Updated : 25 Mar 2021 19:09 IST

అప్‌డేట్‌

టెక్స్ట్‌ మెసేజ్‌లతో పాటు కొన్ని సార్లు ఆడియో మెసేజ్‌లు కూడా వాట్సాప్‌లో వింటుంటాం. ఇలా ఎక్కువ నిడివితో కూడిన వాయిస్‌ మెసేజ్‌లను వినే క్రమంలో ‘ప్లేబ్యాక్‌ స్పీడ్‌’ని పెంచుకోవచ్చు తెలుసా? అందుకు తగిన ఫీచర్‌ని ప్రయోగాత్మకంగా వాట్సాప్‌ యూజర్ల ముందుకు తెస్తోంది. దీంతో వాయిస్‌ మెసేజ్‌లను 1.0ఎక్స్‌, 2ఎక్స్‌ స్పీడ్‌తో వినొచ్చు. అంటే.. ఎవరైనా నెమ్మదిగా మాట్లాడుతూ వాయిస్‌ మెసేజ్‌ పంపితే.. ప్లేబ్యాక్‌ స్పీడ్‌ పెంచుకుని త్వరగా వినొచ్చు అన్నమాట. అలాగే, వాయిస్‌ మెసేజ్‌లు వింటున్నప్పుడు మరో ట్రిక్‌ని ప్రయత్నించొచ్చు. మీరేదైనా వాయిస్‌ మెసేజ్‌ విందాం అనుకున్నప్పుడు హెడ్‌సెట్‌ లేకుంటే ఎలా? లౌడ్‌ స్పీకర్‌లో వినాల్సిందేనా? ఏం అక్కర్లేదు. వాయిస్‌ మెసేజ్‌పై ఒక్కసారి ట్యాప్‌ చేసి, వెంటనే ఫోన్‌ని చెవి దగ్గర పెట్టుకోండి చాలు. వాయిస్‌ మెసేజ్‌ ఫోన్‌ స్పీకర్‌ నుంచి కాకుండా ఫోన్‌ బిల్ట్‌ఇన్‌ ఇయర్‌ఫోన్‌ నుంచి ప్లే అయ్యి వినిపిస్తుంది. దీంతో మీరు మాత్రమే మెసేజ్‌ని వినొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని