ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ పోదు..

నిత్యం మణికట్టుపై వాచ్‌లా ఒదిగిపోయి ఫిట్‌నెస్‌ సంగతుల్ని చెప్పే ట్రాకర్లను కూడా అప్పుడప్పుడు ...

Updated : 14 Apr 2021 17:09 IST

నిత్యం మణికట్టుపై వాచ్‌లా ఒదిగిపోయి ఫిట్‌నెస్‌ సంగతుల్ని చెప్పే ట్రాకర్లను కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. ఉదాహరణకు జిమ్‌లో వర్క్‌అవుట్‌లు చేశాక, ఫ్రెష్‌ అయ్యేటప్పుడు తీసి పక్కనపెట్టి మర్చిపోవచ్చు. అలాంటప్పుడు మీ ట్రాకర్‌ ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవాలంటే? అందుకు ఫిట్‌బిట్‌ ఓ కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ట్రాకింగ్‌ డివైజ్‌లను తయారు చేసే ‘టైల్‌’తో జతకట్టింది. Inspire 2 మోడల్‌లో టైల్‌ టెక్నాలజీని నిక్షిప్తం చేసుకుని టెక్నాలజీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఇక ఫిట్‌బిట్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ని ఎక్కడైనా వదిలేస్తే.. క్షణాల్లో ఎక్కడుందో చూడొచ్చు. అందుకు ఫోన్‌లో టైల్‌ యాప్‌ని వాడుకుంటే సరిపోతుంది. ఎక్కడుందో వెతికి చూడొచ్చు. యాప్‌ నుంచి ట్రాకర్‌ని వైబ్రేట్‌ అయ్యేలా చేయొచ్చు. అదే మాదిరిగా ఫిట్‌బిట్‌ ద్వారా ఫోన్‌ ఎక్కడుందో వెతకొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని