ఇన్‌స్టాలో ‘డ్రాఫ్ట్‌’లు..

సోషల్‌ మీడియా, మెయిల్‌ సర్వీసు... ఇలా ఏది వాడుతున్నా.. పలు రకాల అంశాల్ని పంచుకునేందుకు ...

Published : 31 Mar 2021 00:16 IST

అప్‌డేట్‌

సోషల్‌ మీడియా, మెయిల్‌ సర్వీసు... ఇలా ఏది వాడుతున్నా.. పలు రకాల అంశాల్ని పంచుకునేందుకు కంపోజ్‌ చేస్తుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు టైప్‌ చేసిన మేటర్‌ని పోస్ట్‌ చేయడానికి వీలు పడదు. అలాంటప్పుడు ఆ మొత్తం మీడియా కంటెంట్‌ని  ‘డ్రాఫ్ట్‌’  రూపంలో భద్రం చేసుకోవచ్చు. అందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఆప్షన్‌ని ప్రయోగాత్మకంగా అందిస్తున్నారు. ఇప్పటికైతే ఎక్కడా కనిపించని ఈ డ్రాఫ్ట్‌ ఆప్షన్‌.. త్వరలోనే ఇన్‌స్టా యూజర్లను పలకరించనుంది. ఎప్పుడైతే పోస్ట్‌ చేయకుండా స్టోరీ క్లోజ్‌ చేయడానికి ప్రయత్నిస్తామో.. అప్పుడు ‘డిస్‌కార్డ్‌, క్యాన్సిల్‌’ ఆప్షన్లతో పాటు ‘సేవ్‌ డ్రాఫ్ట్‌’ కూడా కనిపిస్తుంది. ట్యాప్‌ చేస్తే డ్రాఫ్ట్‌ సేవ్‌ అవుతుంది. ఇది పబ్లిక్‌గా ఎవరికీ కనిపించదు. తిరిగి ఎప్పుడైనా ఎడిట్‌ చేయాలనుకుంటే.. డ్రాఫ్ట్స్‌ కలెక్షన్స్‌లోకి వెళ్లి యాక్సెస్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని