ప్రైవసీని పదిలం చేస్తాయి..
ఒక్కసారి నెట్టింట్లో అడుగు పెడితే చాలు. మీరు చేస్తున్న బ్రౌజింగ్‌ని ఆయా బ్రౌజర్లు నిత్యం మానిటర్ చేస్తుంటాయి. డేటాని కలెక్ట్ చేస్తుంటాయి. ఇలా జరగొద్దనుకుంటే..
ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో ప్రైవేటు బ్రౌజింగ్
ఒక్కసారి నెట్టింట్లో అడుగు పెడితే చాలు. మీరు చేస్తున్న బ్రౌజింగ్‌ని ఆయా బ్రౌజర్లు నిత్యం మానిటర్ చేస్తుంటాయి. డేటాని కలెక్ట్ చేస్తుంటాయి. ఇలా జరగొద్దనుకుంటే.. ప్రైవసీని పదిలం చేసే బ్రౌజర్ యాప్‌లను వాడడం మంచిది. అలాంటివి ఏమున్నాయి? ఇవిగోండి కొన్ని.. వీటిల్లో కొన్ని ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చినవి అయితే.. మరికొన్ని ఎక్కువగా ఆదరణ పొందినవి. ప్రయత్నిస్తే మీ వెబ్ విహారంగా ప్రైవేలుగానే సాగుతుంది..
‘ఫోకస్’ పెడతుంది..
ఫైర్ఫాక్స్ ఫోకస్: మోజిల్లా రూపొందించిన ఓపెన్‌సోర్స్ బ్రౌజర్ ఇది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ప్రైవసీ-ఫోకస్డ్ వెబ్-బ్రౌజర్‌గా దీన్ని వాడుకోవచ్చు. ఉచితంగా దీంట్లోని అన్ని బిల్ట్-ఇన్ సౌకర్యాల్ని వాడుకోవచ్చు. యాడ్‌బ్లాకర్, ట్రాకింగ్ ప్రొటెక్షన్, కంటెంట్ బ్లాకింగ్.. సేవలతో మీ గోప్యతని మెరుగుపరుస్తుంది. సాధారణ బ్రౌజర్లలో ఇన్‌కగ్నిటో మోడ్‌ని అవసరం అయినప్పుడే వాడతాం. కానీ, ఫైర్ఫాక్స్ ఫోకస్లో మాత్రం డీఫాల్ట్‌గా ఇన్‌కగ్నిటో మోడ్ ఉంటుంది. అంటే.. మీరు ఏది ఓపెన్ చేసినా ప్రైవేటుగానే ట్యాబ్‌ల్లో దర్శనమిస్తాయి. ఆటోమేటిక్‌గానే వెబ్ ట్రాకర్స్‌ని నియంత్రించడంతో పాటు బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు తుడిచిపెడుతుంది. బ్రౌజర్‌ని నుంచి ఒక్కసారి బయటికి వస్తే చాలు.. అన్నీ తొలగిపోతాయన్నమాట. అయితే, ఎలాండి యాడ్-ఆన్స్ని దీంట్లో జత చేసుకుని వాడుకునేందుకు అవకాశం లేదు. అలాగే, డార్క్‌మోడ్ కూడా ఎక్కడా కనిపించదు. |
‘టోర్’ని ప్రయత్నించారా?
Tor Browser: అన్ని డెస్క్‌టాప్ కంప్యూటర్లలోనే కాకుండా స్మార్ట్ ఫోన్లోనూ వెబ్ విహారాన్ని సురక్షితం చేసుకునేందుకు ఎక్కువ మంది వాడుతున్న బ్రౌజర్ ఇది. ఒక రకంగా ఇది కూడా ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినదే. ఫైర్ఫాక్స్ మాదిరిగానే పని చేసినప్పటికీ.. మొత్తం ట్రాఫిక్ బిల్ట్-ఇన్ టోర్ నెట్‌వర్క్‌లోనే సాగుతుంది. దీంతో నెటిజన్‌గా మీ ఉనికిని హ్యాకర్లు పసిగట్టడడం సాధ్యం కాదు. ‘మల్టీ-లేయర్డ్ ఎన్క్రిప్షన్’లోనే వెబ్ విహారం సాగుతుంది. వెబ్ పేజీలు కాస్త నెమ్మదిగా ఓపెన్ అయినప్పటికీ.. ప్రైవసీని కోరుకునేవారు టోర్ని ప్రయత్నించొచ్చు. |
అన్నింటి కలగలుపు..
DuckDuckGo: మోడ్రన్ మొబైల్ బ్రౌజర్‌గా దీన్ని పిలుస్తున్నారు. ట్యాబ్‌లు, బుక్మార్క్లు, డార్క్‌మోడ్.. లాంటి మరిన్ని ఆప్షన్లతో పని చేస్తుంది. అంతేకాదు.. ప్రైవసీని పదిలం చేసుకునేందుకు తగిన ప్రత్యేక ఆప్షన్లు కూడా ఉన్నాయి. మొత్తం బ్రౌజింగ్ హిస్టరీని సింగిల్ ట్యాప్‌తో డిలీట్ చేయొచ్చు. నక్కి ఉండే థర్డ్ పార్టీ ట్రాకర్స్‌ని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. ‘గ్లోబల్ ప్రైవసీ కంట్రోల్’ పాలసీతో ఇది నెటిజన్లను అప్రమత్తం చేస్తుంది. |
‘యాడ్స్’ని నియంత్రిస్తుంది
Adblock Browser: ఏ వెబ్ పేజీ ఓపెన్ చేసినా.. ఒకటే ప్రకటనలు. పాప్-అప్స్ రూపంలో వచ్చేవి కొన్నయితే.. వీడియో యాడ్స్‌లా కనిపించేవి ఇంకొన్ని. ఇలా వెబ్ విహారంలో పొడుచుకొచ్చే వాటిని బ్లాక్ చేసేందుకు అనువైన బ్రౌజర్. అంతేకాదు.. ‘గోస్ట్మోడ్’ని ఎంచుకుని బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, టెంపరరీ ఫైల్స్‌ని బ్రౌజర్లో స్టోర్ అవ్వకుండా జాగ్రత్త పడొచ్చు. |
‘బ్రేవ్’గా సాగిపోండి..
Brave Browse: ఇదో ఓపెన్‌సోర్స్ బ్రౌజర్. తక్కువ మెమొరీతో క్షణాల్లో ఫోన్లో ఒదిగిపోయి పని చేస్తుంది. ఎలాంటి పాప్-అప్లు, యాడ్లు, ఇతర మాల్వేర్లు వెబ్ విహారాన్ని పసిగట్టకుండా జాగ్రత్త పడుతుంది. వెబ్ పేజీలను వేగం ఓపెన్ చేస్తూ.. ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్‌ని ఆదా చేస్తుంది. అంతేకాదు.. మొబైల్ డేటా కూడా ఎక్కువగా ఖర్చవకుండా చూస్తుంది. డౌన్లోడ్ లింక్: https://bit.ly/3sltiLm |
యాంటీవైరస్‌లా సురక్షితం..
Avast Secure Browser: ఫోన్‌ని సురక్షితం చేసుకోవడానికి యాంటీవైరస్ ఎలా వాడతామో.. బ్రౌజింగ్‌లో గోప్యతని పాంటించేందుకు ప్రైవేటు బ్రౌజర్‌ని వాడుతాం. అందుకే ఈ సెక్యూర్డ్ బ్రౌజర్. పబ్లిక్ వై-ఫైని వాడుకునే క్రమంలో వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్ని (వీపీఎస్) క్రియేట్ చేసుకుని వెబ్‌లో విహరించొచ్చు. బిల్ట్-ఇన్ యాడ్-బ్లాకర్‌తో ప్రకటనలు, వెబ్-ట్రాకర్స్‌ని అడ్డుకోవచ్చు. ప్రైవేటు సెర్చింజన్లతో వెతుకులాట సాగించొచ్చు. డౌన్లోడ్ లింక్: https://bit.ly/3f6K2lW |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్