లాక్‌స్క్రీన్‌గా కిండిల్‌ బుక్‌

కిండిల్‌ ఈ-బుక్‌ పాఠకులకు శుభవార్త. ప్రస్తుతం చదువుతున్న పుస్తకాన్ని లాక్‌ స్క్రీన్‌గా అమర్చుకునేలా అమెజాన్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

Published : 21 Apr 2021 01:14 IST

కిండిల్‌ ఈ-బుక్‌ పాఠకులకు శుభవార్త. ప్రస్తుతం చదువుతున్న పుస్తకాన్ని లాక్‌ స్క్రీన్‌గా అమర్చుకునేలా అమెజాన్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది కిండిల్‌ (8, 9 జెనరేషన్‌), కిండిల్‌ పేపర్‌వైట్‌ (7, 10 జెనరేషన్‌), కిండిల్‌ ఒయాసిస్‌ (8, 9, 10 జెనరేషన్‌), కిండిల్‌ వోయేజ్‌ (7వ జెనరేషన్‌) రీడర్లకు అందుబాటులో ఉండనుంది. సెట్టింగ్సులోకి వెళ్లి కొత్త షో కవర్‌ ఆప్షన్‌ను ఎంచుకొని లాక్‌ స్క్రీన్‌గా పెట్టుకోవచ్చు. ఐఓఎస్‌ వాడేవారు నేరుగా ఆడియోబుక్స్‌ను కొనే సదుపాయాన్నీ అమెజాన్‌ కొత్తగా కల్పించింది. వైబ్‌సైట్‌లోకి వెళ్లకుండా యాప్‌ నుంచే నేరుగా వీటిని కొనుక్కోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని