సూక్ష్మ ప్లాస్టిక్‌లకు చెక్చ్‌

ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న భూతం ప్లాస్టిక్‌. ముఖ్యంగా సూక్ష్మ ప్లాస్టిక్‌లు సముద్రాలను విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రం నీటి నుంచి ప్లాస్టిక్‌ను తొలగించేందుకు ఐఐటీ గువాహటి పరిశోధకులు సూక్ష్మ వడపోత విధానాన్ని అభివృద్ధి చేశారు. వీరి పరిశోధన ‘ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

Updated : 28 Apr 2021 04:42 IST

ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న భూతం ప్లాస్టిక్‌. ముఖ్యంగా సూక్ష్మ ప్లాస్టిక్‌లు సముద్రాలను విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రం నీటి నుంచి ప్లాస్టిక్‌ను తొలగించేందుకు ఐఐటీ గువాహటి పరిశోధకులు సూక్ష్మ వడపోత విధానాన్ని అభివృద్ధి చేశారు. వీరి పరిశోధన ‘ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. అంగుళంలో అయిదో వంతు కన్నా చిన్నగా ఉండే ప్లాస్టిక్‌ ముక్కలు దాదాపు అన్ని సముద్రాలు, సముద్ర జీవుల్లో కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మరో ప్రమాదకర విషయం ఏంటంటే వీటి అవశేషాలు సముద్రపు ఉప్పులోకి చేరి మన వంటింటి వరకూ వచ్చేస్తున్నాయి. తూర్పు ఆసియాలో జరిపిన పరిశోధనల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 90% ఉప్పు బ్రాండ్లలో ప్లాస్టిక్‌ అవశేషాలు కనిపిస్తుండటం ఆందోళనకరం. వీటి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. సంతాన లేమి, నాడుల సమస్యలు, క్యాన్సర్ల వంటి జబ్బుల ముప్పు పెరిగే అవకాశముంది. అందుకే సముద్రపు నీటిని వడ కట్టేందుకు హోలో ఫైబర్‌ మైక్రోఫిల్ట్రేషన్‌ (హెచ్‌ఎఫ్‌-ఎంఎఫ్‌) పొరను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో వందల సంఖ్యలో స్ట్రాల లాంటి చిన్న చిన్న గొట్టాలుంటాయి. సూక్ష్మమైన రంధ్రాలతో కూడిన వీటి గోడల గుండా నీరు వెళ్లినప్పుడు మైక్రోప్లాస్టిక్‌లు లోపలే చిక్కుకుపోతాయి. నిజానికి హెచ్‌ఎఫ్‌-ఎంఎఫ్‌ పరిజ్ఞానాన్ని మురుగు నీటి శుద్ధికి, పండ్ల రసాలు తయారుచేయటానికి, డయాలసిస్‌ మెంబ్రెన్ల వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు పర్యావరణ హితం కోసమూ ఉపయోగించటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని