ఎడ్జ్ తీసుకుంటున్నారా?
బ్రౌజర్ అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేవి గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్లే. ఎందుకనో మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ ఈ విషయంలో వెనకే ఉండిపోతుంటుంది. బ్రౌజర్ లోపాలను, కొరతను అధిగమించటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకూ పెద్దగా ఆదరణ లభించలేదు. మరో ప్రయత్నంలో భాగంగా ఎట్టకేలకు కాలం చెల్లిన ఎడ్జ్‌కు మంగళం పాడింది. దీన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి తొలగించి, సరికొత్త ఎడ్జ్‌ను ప్రవేశపెట్టింది. తాజా విండోస్ 10 అప్డేట్తో పాటే ఇదీ అందుబాటులోకి వచ్చేసింది. నిజానికి ప్రధాన బ్రౌజర్‌గా ఎడ్జ్‌ను వాడేవారు చాలా తక్కువే అనుకోవచ్చు.
బ్రౌజర్ అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేవి గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్లే. ఎందుకనో మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ ఈ విషయంలో వెనకే ఉండిపోతుంటుంది. బ్రౌజర్ లోపాలను, కొరతను అధిగమించటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకూ పెద్దగా ఆదరణ లభించలేదు. మరో ప్రయత్నంలో భాగంగా ఎట్టకేలకు కాలం చెల్లిన ఎడ్జ్‌కు మంగళం పాడింది. దీన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి తొలగించి, సరికొత్త ఎడ్జ్‌ను ప్రవేశపెట్టింది. తాజా విండోస్ 10 అప్డేట్తో పాటే ఇదీ అందుబాటులోకి వచ్చేసింది. నిజానికి ప్రధాన బ్రౌజర్‌గా ఎడ్జ్‌ను వాడేవారు చాలా తక్కువే అనుకోవచ్చు. కానీ వినూత్న ఎడ్జ్‌ను పరిశీలిస్తే ఎవరైనా మనసు మార్చుకోవాల్సిందే. ఇది క్రోమ్ కన్నా మెరుగ్గా పనిచేసున్నట్టు ప్రశంసలు పొందుతుండటం విశేషం.
అంతర్జాల విజ్ఞాన ప్రపంచంలో విహరించటానికి ప్రవేశ ద్వారం బ్రౌజరే. ఏం శోధించాలన్నా, ఏం సంగ్రహించాలన్నా ఇదే కీలకం. అలాంటి బ్రౌజర్ అధునాతనమైనదైతే, మెరుపు వేగంతో సమాచారాన్ని కళ్ల ముందు నిలిపేదైతే, తక్కువ మెమరీని తీసుకునేదైతే, ప్రాసెసర్ శక్తిని తక్కువగా వినియోగించుకునేదైతే, మరింత మెరుగైన గోప్యత సెట్టింగులతో కూడుకున్నదైతే ఇక చెప్పేదేముంది? అలాంటి ప్రయత్నంలో భాగంగా రూపొందించిందే ఎడ్జ్ బ్రౌజర్. మరి మీ కంప్యూటర్లో ఇది అప్‌గ్రేడ్ అయ్యిందా, లేదా అనేది తెలుసుకోవటమెలా? ముందుగా ఎడ్జ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి చూడండి. కుడివైపున అన్నింటికన్నా పైన అడ్డంగా ఉండే 3 చుక్కలను క్లిక్ చేయండి. తర్వాత ఆయా వివరాలను పరిశీలిస్తూ కిందికి రండి. హెల్ప్ యాడ్ ఫీడ్‌బ్యాక్‌ను ఎంచుకోండి. తర్వాత ‘అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్’ను క్లిక్ చేయండి. ఒకవేళ తాజా వెర్షన్ కానట్టయితే తనకు తానే అప్‌గ్రేడ్ అవుతుంది. వినూత్నమైన ఎడ్జ్‌ను క్లాసిక్ బ్రౌజరనే అనుకోవచ్చు. క్రోమ్‌తో పోలిస్తే చాలా విషయాల్లో ముందుంటుందన్నా అతిశయోక్తి కాదు. మరింత మెరుగైన ప్రైవసీ సెట్టింగులు దీని సొంతం. కంప్యూటర్ పవర్, ప్రాసెసర్, మెమరీని తక్కువగానూ ఉపయోగించుకుంటుంది. క్రోమ్ బ్రౌజర్లో ఎన్నో ఎక్స్టెన్షన్లు వాడుకుంటుంటాం కదా. అవన్నీ ఎడ్జ్లోనూ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల దీని విషయాలు, విశేషాలపై ఓ కన్నేద్దాం.
ప్రత్యేక సైడ్బార్
ఎడ్జ్ బ్రౌజర్లో కొత్తగా చెప్పుకోవాల్సింది సైడ్ బార్ సెర్చ్ ఆప్షన్ గురించి. ఓపెన్ చేసిన ట్యాబ్‌ను వీడకుండానే దీంతో అవసరమైన అంశాలను సెర్చ్ చేసుకోవచ్చు. వెబ్ పేజీలోనూ ఏదైనా అంశం గురించి మరింత బాగా తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని అనుకుంటే వాటిని హైలైట్ చేయొచ్చు కూడా. దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్క్లిక్తో సైడ్‌బార్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. అదనపు సమాచారం సైడ్‌బార్‌లో డిస్ప్లే అవుతుంది. కంట్రోల్, షిఫ్ట్, ఇ బటన్లను ఒకేసారి నొక్కటం ద్వారా సైడ్బార్ సెర్చ్‌ను వాడుకోవచ్చు. బింగ్లోనైతే డిఫాల్ట్‌గానే ఎడ్జ్‌లో ఈ సెర్చ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.
సైట్లు యాప్స్‌గా..
తరచూ సందర్శించే వెబ్సైట్లను షార్ట్ కట్ రూపంలో ఓపెన్ చేయటానికి తంటాలు పడుతున్నారా? ఎడ్జ్‌లో అలాంటి ఇబ్బందులు చాలావరకు తప్పించుకోవచ్చు. వెబ్సైట్లను యాప్స్గానూ మార్చుకోవచ్చు మరి. సెర్చ్ మెనూ లేదూ డెస్క్‌టాప్‌లో పిన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎడ్జ్ ఓపెన్ చేసి యాప్‌గా మార్చుకోవాలనుకునే వెబ్‌సైట్‌ను తెరవాలి. బ్రౌజర్ కుడివైపున పైన ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాప్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ దిస్ సైట్ యాజ్ యాన్ యాప్‌ను ఎంచుకోవాలి. దీనికి ఒక పేరు పెట్టుకొని, ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయాలి. అంతే. స్టార్ట్ మెనూలో వెబ్సైట్ ఐకాన్ క్రియేట్ అవుతుంది. దీన్ని డెస్క్‌టాప్ మీదికి తెచ్చుకొని షార్ట్‌కట్‌గానూ వాడుకోవచ్చు. కావాలంటే టాస్క్‌బార్‌కు పిన్ కూడా చేసుకోవచ్చు. అవనసరమనుకుంటే యాప్‌ను తొలగించుకోవచ్చు కూడా. విండోస్ సెట్టింగ్స్‌లో యాప్స్ విభాగంలో మేనేజ్ యాప్స్ ద్వారా తీసేసుకోవచ్చు. ఎడ్జ్ మూడు చుక్కల మీద క్లిక్ చేసి, యాప్స్ విభాగంలో మేనేజ్ యాప్స్ ద్వారానూ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఒకే సమయంలో ఎక్కువ ట్యాబ్‌లు
ఆయా పనులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒకే సమయంలో ఎక్కువ ట్యాబ్‌లు తెరవాల్సి రావొచ్చు. వాటిని మాటిమాటికి మార్చి మార్చి చూడాల్సిన అవసరముండొచ్చు. ఇది కంప్యూటర్ మెమరీని, ప్రాసెసర్ వేగాన్ని బాగా తినేస్తుంది. సాధారణంగా అన్ని బ్రౌజర్లు ట్యాబ్స్‌ను అడ్డంగా అమరుస్తుంటాయి. కానీ ఎడ్జ్ దీని రూపురేఖలనే మార్చేసింది. తెరచి ఉంచిన ట్యాబ్స్‌ను బ్రౌజర్‌కు ఒక వైపున నిట్ట నిలువుగా కనిపించేలా చేస్తుంది. అంతేనా? మెమరీ ఖర్చుకాకుండా ట్యాబ్స్‌ను దానంతటదే స్లీప్ మోడ్లోకీ మార్చేస్తుంది. ఇందుకోసం పైన కనిపించే మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి, అక్కడ్నుంచి సిస్టమ్‌లోకి, దాని కింద ఉండే ‘సేవ్ రిసోర్సెస్’లోకి వెళ్లాలి. సేవ్ రిసోర్సెస్ విత్ స్లీపింగ్ ట్యాబ్స్‌ను ఆన్ చేయాలి. ఇందులో ట్యాబ్ ఎంతసేపు అచేతన స్థితిలో ఉండాలో కూడా ఎంచుకోవచ్చు. ట్యాబ్ మీద క్లిక్ చేసి తిరిగి యాక్టివ్‌గానూ మార్చుకోవచ్చు.
నిరంతరం ఆన్‌లోనూ..
సేవ్ రిసోర్సెస్‌లో మరో అదనపు ఆప్షన్ కూడా ఉంది. అదే వెబ్‌సైట్‌ను అసలు స్లీప్ మోడ్‌లోకి వెళ్లకుండా చూసుకోవటం. కొన్నిసార్లు వెబ్‌లో విహరిస్తున్నప్పుడు ఒకటి కన్నా ఎక్కువ వైబ్సైట్లను ఎప్పుడూ ఆన్‌లోనే ఉండేలా చూసుకోవాల్సిన అవసరముండొచ్చు. అలాంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి, కనిపించే మెనూలో పిన్ ట్యాబ్ ఎంచుకోవాలి. ఓపెన్ అయిన ఇతర ట్యాబ్స్‌కు ఇది అన్నింటికన్నా ఎడమవైపున.. అదీ అదృశ్య రూపంలో ఉండిపోతుంది. బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైనా సైట్‌ను టాస్క్‌బార్‌కు పిన్ చేసుకునే వెసులుబాటూ ఉంది. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశాక పైన కుడివైపు మూడు చుక్కల మీద క్లిక్ చేసి.. మోర్ టూల్స్‌లోకి వెళ్లి టాస్క్‌బార్‌కు పిన్ చేసుకోవచ్చు. కావాలంటే వెబ్సైట్ పేరును మార్చుకోవచ్చు.
సురక్షిత కిడ్స్ మోడ్
ఎడ్జ్‌లో మరో సురక్షితమైన అంశం కిడ్స్ మోడ్. ప్రత్యేకించి 5-8 ఏళ్లు, 9-12 ఏళ్ల పిల్లలను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు. ఇందులోని ‘గార్డ్రెయిల్స్’ బిల్టిన్ జాబితా సాయంతో పిల్లలను అనుచిత వెబ్సైట్ల నుంచి కాపాడుతుంది. తల్లిదండ్రులు రివ్యూ చేసి చూడొచ్చు. సెట్టింగ్స్ ద్వారా అనుమతించిన అంశాల్లో మార్పులు చేసుకోవచ్చు.
ఇలా కొత్త ఎడ్జ్‌లో శోధిస్తే మరెన్నో వినూత్న ఫీచర్లను చూడొచ్చు. కొత్త విండోస్ వాతావరణంలో వెబ్‌లో విహరించాలనుకునేవారికిది మంచి ప్రత్యామ్నాయమనటంలో ఎలాంటి సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా