శరీర వేడి నుంచే విద్యుత్తు

మన శరీర ఉష్ణోగ్రతే విద్యుత్తుగా మారితే? ఎల్‌ఈడీ తెరలు పనిచేసేలా చేస్తే? థర్మోఎలెక్ట్రిక్‌ జెనరేటర్‌(టీఈజీ)తో కూడిన రిస్ట్‌బ్యాండులతో ...

Updated : 12 May 2021 00:34 IST

న శరీర ఉష్ణోగ్రతే విద్యుత్తుగా మారితే? ఎల్‌ఈడీ తెరలు పనిచేసేలా చేస్తే? థర్మోఎలెక్ట్రిక్‌ జెనరేటర్‌(టీఈజీ)తో కూడిన రిస్ట్‌బ్యాండులతో దీన్ని సుసాధ్యం చేయొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. భవిష్యత్తులో ఇది స్మార్ట్‌వాచెస్‌ వంటి పరికరాలకు విద్యుత్తు అందించటానికి ఉపయోగపడగలదని, సంప్రదాయ ఛార్జింగ్‌ పరికరాల అవసరాన్ని తప్పించగలదని భావిస్తున్నారు. ఒంటికి ధరించే పరికరాలకు విద్యుత్తు సరఫరా పెద్ద సమస్య. తాజా పరిజ్ఞానంతో దీన్ని అధిగమించవచ్చు. టీఈజీలను విరివిగా ఉపయోగిస్తున్నమాట నిజమే అయినా ఇవి గట్టిగా ఉంటాయి. మరి వీటిని మృదువుగా మారిస్తే? శాస్త్రవేత్తలు అదే చేశారు. టీఈజీ పదార్థాలైన మెగ్నీషియం, బిస్ముత్‌లను పాలీయురేథేన్‌, వంగే ఎలక్ట్రోడ్‌ మధ్య ఉంచి చేతికి అంటిపెట్టుకొని ఉండేలా తీర్చిదిద్దారు. దీంతో చర్మం వేడి, చుట్టుపక్కల వాతావరణంలోని ఉష్ణోగ్రతల మధ్య తేడాలను ఉపయోగించుకొని విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవటానికి మార్గం సుగమమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు