స్మార్ట్‌వాచ్‌లకూ జీబోర్డు

గూగుల్‌ ఎట్టకేలకు చేతికి ధరించే స్మార్ట్‌వాచ్‌ల కోసం జీబోర్డును పరిచయం చేయనుంది. ఈ కొత్త ఓఎస్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది....

Published : 12 May 2021 00:18 IST

గూగుల్‌ ఎట్టకేలకు చేతికి ధరించే స్మార్ట్‌వాచ్‌ల కోసం జీబోర్డును పరిచయం చేయనుంది. ఈ కొత్త ఓఎస్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌వాచ్‌ల కోసం గూగుల్‌ ఇప్పటివరకు భారీ అప్‌డేట్‌లేవీ ప్రవేశపెట్టలేదు. జీబోర్డుతో ఈ కొరత తీరనుంది. నిజానికి స్మార్ట్‌వాచ్‌ల మీద టైప్‌ చేయటం కష్టం. అందుకే ఎమోజీల కోసం షార్ట్‌కట్స్‌, నంబర్‌ కీప్యాడ్‌, వాయిస్‌ ఇన్‌పుట్‌ వంటి కొత్త ఫీచర్లనూ ఇందులో జోడించటం విశేషం. టైప్‌ చేస్తున్నప్పుడు ఆయా విషయాలకు సంబంధించిన పదాలనూ ఇది సూచిస్తుంది. దీంతో తప్పులూ తేలికగా సరిదిద్దుకోవచ్చు. వాయిస్‌ ఇన్‌పుట్‌తో టైప్‌ చేయకుండానే మాటలతోనే సందేశాలను పంపుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని